శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తా
ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా.. స్వచ్ఛంద పదవీ విరమణ
గుర్గావ్
శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తాను’ అంటూ ఐజీ స్థాయి పోస్టులో కొనసాగుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా..స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నది. ఇందుకు ఆమె చెప్పిన కారణంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భగవాన్ ‘శ్రీకృష్ణుడి సేవ’కు అంకితమయ్యేందుకు కోసం స్వచ్ఛందంగా పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీకి దరఖాస్తు పంపారు. 1998 బ్యాచ్‌కు చెందిన భారతి అరోరా ప్రస్తుతం అంబాలా రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్నారు.2007 సంజౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడుపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు నాయకత్వం వహించారు. ప్రస్తుతం ‘సేవ చేయడం నా అభిరుచి, నాకు గర్వకారణం. ప్రస్తుతం నేను జీవితంలోని అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. గురునానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్‌దాస్, తులసీద్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తాను’ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘తాను కొన్ని సంవత్సరాలుగా సేవామార్గాన్ని వదిలి.. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని ఆలోచిస్తున్నానని, భగవంతుని సాక్షాత్కారం పని చేస్తాను’ అని తెలిపారు. రాజకీయాల్లో చేరే ఉద్దేశం తనకు లేదని, ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ కోరినట్లు స్పష్టం చేశారు.