YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీపై రాహుల్ ఫైర్

మోడీపై రాహుల్ ఫైర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటలపోరు బలపడుతోంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ (కాంగ్రెస్ లేని భారత్) నినాదంతో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ ముక్త్ భారత్ ను తాను కోరుకోవడం లేదని తెలిపారు. బీజేపీని తాను ఎదుర్కొంటానని, బీజేపీని ఓడిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి పోయిన నేతలు కూడా ఇప్పుడు పునరాలోచన చేస్తున్నారని చెప్పారు. ఆరెస్సెస్ జాతీయవాదం కర్ణాటకలో పారడం లేదని తెలిపారు. కర్ణాటక ప్రజల గొంతుకలకు, ఆరెస్సెస్ (మోదీ)కి మధ్య జరుగుతున్న పోటీనే కర్ణాటక ఎన్నికలని చెప్పారు. తప్పులు చేస్తున్న నరేంద్ర మోదీలాంటి వ్యక్తులను భారతీయులు భరించలేకపోతున్నారని అన్నారు.గురువారం తాజాగా కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మోదీపై ట్వీట్ల దాడికి దిగారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాముఖ్యం విషయంలో మోదీ ప్రోగ్రెస్‌ కార్డుకు తాను ‘ఎఫ్‌’ గ్రేడ్‌ ఇస్తానంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు మద్దతు ధరలకు సంబంధించిన చార్ట్‌ను కూడా పోస్ట్‌ చేశారు.రాహుల్‌ ‘ మోదీజీ.. కర్ణాటకలోని వ్యవసాయం అనే సబ్జెక్ట్‌గాను మీ రిపోర్ట్‌ కార్డ్‌. 8,500 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు అందిస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. ప్రధానమంత్రి పంటలబీమా పథకంలోనూ రైతులకు అన్యాయమే జరిగింది. దీని వల్ల ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకే మంచి లాభాలొచ్చాయి. కర్ణాటక రైతులకు మద్దతు ధర కూడా కల్పించలేదు. ఈ అన్ని అంశాల్లోనూ కలిపి నేను మీకిస్తున్న గ్రేడ్‌ ‘ఎఫ్‌’’ అంటూ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు 2017-18 ఖరీఫ్‌ సీజన్‌ మార్కెటింగ్‌ సంబంధించిన మద్దతు ధరల చార్ట్‌ను రాహుల్ ట్విటర్‌లో పంచుకున్నారు.రెండు రోజుల క్రితం మోదీ ఉడుపి పర్యటనలో భాగంగా...రాహుల్‌పై విమర్శనాస్త్రాలు సంధించిన విషయం విదితమే. తర్వాత రాహుల్‌ ఇలా ట్వీట్ చేయడం గమనార్హం. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు ఈనెల 15న వెలువడనున్నాయి.

Related Posts