ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 152వ రోజు బందరులో కొనసాగింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. గురువారం ఉదయం జననేత వైఎస్ జగన్ మచిలీపట్నం నియోజవకర్గం పొట్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని, సామాజికంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన కులాలు తమవని, ఆదుకోవాలంటూ వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు.అధికారంలోకి రాగానే విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్‌ను పునరుద్దరిస్తామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీవో నంబర్ 23 అమల్లో ఉండేదని, అప్పుడు కార్పొరేషన్ ఉన్నదానిని చంద్రబాబు ప్రభుత్వం ఫెడరేషన్‌గా మార్చేసింది. అదేవిధంగా జీవో 272 వైఎస్‌ఆర్ హయాంలో ఉండేది. 272 జీవో వల్ల వేధింపులకు గురికాకుండా రక్షణగా ఉండేది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. . అక్కడి నుంచి కొత్తపుడి క్రాస్ రోడ్డు మీదుగా బుద్దాల పాలెం వరకు పాదయాత్ర కొనసాగింది.