ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోన్న యమునా..డిల్లీ లో హై అలర్ట్
న్యూఢిల్లీ జూలై 30
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలతో పాటు హర్యానాలోని హత్నికుంద్ బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో యమునాకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు 13 బోట్లను అందుబాటులో ఉంచారు. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద ఉదయం 8:30 గంటలకు 205.22 మీటర్ల ఎత్తులో యమునా ప్రవహించింది. క్రమక్రమంగా యమునా నదిలో వరద ప్రవాహం పెరుగుతుందని అధికారులు తెలిపారు.