భారీ కుదుపునకు గురైన అంతర్ జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం
45 డిగ్రీల మేర మరోవైపు కదిలిన స్పేస్ స్టేషన్
అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు సురక్షితం
న్యూ ఢిల్లీ జూలై 30
అంతర్ జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం భారీ కుదుపునకు గురైంది. దీంతో ఆ స్పేస్ స్టేషన్ 45 డిగ్రీల మేర మరోవైపు కదిలింది. రష్యాకు చెందిన నౌకా మాడ్యూల్‌ను డాకింగ్ చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నది. నౌకా మాడ్యూల్‌లో ఉన్న థ్రస్టర్లు ఒక్కసారిగా ఫైర్ కావడంతో అంతరిక్ష పరిశోధనా కేంద్రం అదుపు తప్పి స్థానచలనం చెందింది. అయితే నాసా శాస్త్రవేత్తలు స్పేస్ స్టేషన్‌ను మళ్లీ సరైన ఆల్టిట్యూడ్‌లో పెట్టారు. ఈ ఘటన వల్ల ఆ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. మిషన్ కంట్రోల్ బృందాలు.. స్పేస్ స్టేషన్‌లో జరిగిన లోపాలను సరిదిద్దారని, అన్ని సిస్టమ్స్ నార్మల్‌గా ఆపరేట్ అవుతున్నట్లు నాసా స్పేస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. 43 అడుగుల పొడుతు, 23 టన్నుల నౌకా మాడ్యూల్‌ను ఇటీవల స్పేస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే లింకింగ్ సమయంలో అంతరిక్ష పరిశోధనా కేంద్రం భారీ కుదుపునకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పేస్ స్టేషన్‌లో అమెరికా, రష్యాకు చెందిన ఏడు మంది సిబ్బంది ఉన్నారు. మాడ్యూల్‌ను ఫిక్స్ చేసిన కొన్ని గంటల తర్వాత స్పేస్ స్టేషన్ అదుపు తప్పినట్లు నాసా చెబుతోంది. ఆ సమయంలో వ్యోమగాములతో కమ్యూనికేషన్ దెబ్బతిన్నట్లు నాసా పేర్కొన్నది.