YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

గ్రూప్ 1-2-4 సర్వీస్ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి        పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి

గ్రూప్ 1-2-4 సర్వీస్ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి        పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి

గ్రూప్ 1-2-4 సర్వీస్ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి
       పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి
హైదరాబాద్ జూలై 30
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1-2-4 సర్వీస్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్  కోటా క్రింద వచ్చే ఉద్యోగాల సంఖ్యను  కరెక్టుగా లెక్కించి, వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ముట్టడించారు. పెద్దఎత్తున నినాదాలు ఇచ్చారు.ఈ సందర్బంగా  భారీగా పొలీస్ బందోబస్తు చేశారు.చైర్మన్ తో చర్చలు ముఖ్యమంత్రి గారు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా అధికారులు  గ్రూప్-1  మరియు గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లెక్కించడంలో అనేక అవక-తవకలకు, అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారని, అందుకు రాజ్యాంగబద్ధమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ జోక్యం చేసుకొని నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని చైర్మన్ జనార్దన్ రెడ్డిని ఆర్.కృష్ణయ్య కోరారు.చైర్మన్ హామీచైర్మన్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రిన్సిపల్ సెక్రెటరీ తో మాట్లాడి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను అన్యాయం జరగకుండా లెక్కించి భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ చర్చలలో నీల వెంకటేష్, గుజ్జ కృష్ణ, పగిళ్ళ సతీష్, చంటి ముదిరాజ్, సుచిత్ కుమార్, అనంతయ్య, ఉదయ్, నికిల్, మనికంట గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts