కరోనావైరస్ వచ్చి మనుషుల లైఫ్‌స్టైల్ మొత్తాన్ని మార్చేసింది. స్కూళ్లు లేవు.. ఆఫీసులు లేవు.. సినిమాలు లేవు.. షికార్లు లేవు.. అన్నీ ఇంటి దగ్గరే అయిపోయాయి. జీవితం మొత్తం మారిపోయింది. కొవిడ్ వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా.. ఇంకా ఈ వైరస్ వణికిస్తూనే ఉంది. ఇంకెన్ని రోజులు ఇలాగే భయపెడుతుందో ! దీనికి అంతమెప్పుడో చెప్పలేని స్థితి.మనుషులపై ఇలాంటి మహమ్మారులు విరుచుకుపడటం ఇదే మొదటిదేమీ కాదు.. గతంలో ఇలాంటి మహమ్మారులు చాలామంది జీవితాలను బలితీసుకున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి మరో మహమ్మారి రాదని చెప్పలేం ! ఈ వైరస్‌ను చైనా ల్యాబ్‌లో తయారు చేసిందని వాదనలు ఉన్నాయి.. అది ఎంతవరకు నిజమో ఇంకా నిర్ధారణ కాలేదు.. కానీ గతంలో వచ్చిన మహమ్మారులు మాత్రం వాటంతట అవే పుట్టుకొచ్చాయి. మరి ఈ వైరస్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి ఎలా పుట్టుకొస్తున్నాయి? వాటి పుట్టుకకు కారణమేంటి? అనే సందేహాలు మాత్రం చాలామందిలోనే ఉన్నాయి. ఇదే సందేహం వచ్చిన ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్‌ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీస్ ( ఐపీబీఈఎస్ ) పరిశోధన చేసిన ఒక నివేదిక విడుదల చేసింది.. మరి ఆ నివేదికలోని వివరాలు ఏంటో ఒకసారి చూద్దామా..ఇప్పటివరకు మనుషులకు సోకిన వ్యాధుల్లో చాలావరకు జంతువులు, పక్షుల నుంచే వ్యాపిస్తున్నాయి. జంతువులు, పక్షుల్లో ఉన్న వైరస్‌లు రూపాంతరం (మ్యుటేషన్ ) చెంది మనుషులపై విరుచుకుపడుతున్నాయి. ఇలా మూగజీవాల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులను జూనోటిక్ లేదా జూనోసెస్ అని పిలుస్తారు. ఈ జూనోసెస్ వ్యాధుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని రకాల వైరస్‌లు సామర్థ్యం పెంచుకుని మహమ్మారులుగా మారుతున్నాయి. ఐపీబీఈఎస్ అధ్యయనం ప్రకారం.. 1940 నుంచి ఇప్పటివరకు కొత్తగా 330 అంటువ్యాధులను గుర్తించారు. వాటిలో 60 శాతానికి పైగా జంతువులు, పక్షుల నుంచే వచ్చాయని తెలిపిందిఇన్‌ఫ్లుయెంజా, సార్స్, కరోనా సహా చాలా వ్యాధులు కూడా జంతువులు, పక్షుల నుంచి వచ్చినవే. ఎబోలా, జికా, నిఫా వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లు కూడా వాటి నుంచి విస్తరించినవే..మరో వైపు కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా నాలుగో రోజు కూడా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసులు 1.6 లక్షలకు పెరిగాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. కాగా, గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 20,772 కరోనా కేసులు, 116 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,70,137కు, మొత్తం మరణాల సంఖ్య 16,701కు పెరిగింది.మరోవైపు గత 24 గంటల్లో 14,651 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,92,104కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,60,824 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.