YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నీలకంఠ దర్శకత్వంలో మరో ఆణిముత్యం

నీలకంఠ దర్శకత్వంలో మరో ఆణిముత్యం

తెలంగాణ చరిత్రలో వెదిరె రామచంద్రారెడ్డికి ఓ స్థానముంది.  పోచంపల్లికి చెందిన ఆయన భూదానోద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు.  1951లో ఆచార్య వినోబాభావే అడగగానే... ప్రథమ భూదాతగా 100 ఎకరాల భూమిని పేదలకు దానమిచ్చి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.  ఇప్పుడాయన జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు ప్రముఖ దర్శకుడు నీలకంఠ.  ఈ బయోపిక్ ను అల్లు అర్జున్ మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తుండగా...  వెదిరె రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పించనున్నారు.  ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “ప్రపంచ చరిత్రలో భూమి కోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి.  ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేదలకు అందజేయడం ఒక మహా అద్భుతం.  ఇదొక మహా యజ్ఞంగా సాగింది.  ఈ భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామచంద్రారెడ్డి.  అందుకే ఆయన గురించి, పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం.  ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.  త్వరలో నటీనటుల్ని ఎంపిక చేసి, చిత్రీకరణ ప్రారంభిస్తాం” అన్నారు.

Related Posts