YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కార్పొరేటర్ నీలా రవినాయక్ అసత్య ఆరోపణలు మానుకోవాలి  పార్టీలకు అతీతంగా మీర్పేట్ కార్పొరేషన్ అభివృద్ధి

కార్పొరేటర్ నీలా రవినాయక్ అసత్య ఆరోపణలు మానుకోవాలి  పార్టీలకు అతీతంగా మీర్పేట్ కార్పొరేషన్ అభివృద్ధి

కార్పొరేటర్ నీలా రవినాయక్ అసత్య ఆరోపణలు మానుకోవాలి
 పార్టీలకు అతీతంగా మీర్పేట్ కార్పొరేషన్ అభివృద్ధి
రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా  మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీలకు ఆతీతంగా అభివృద్ధి జరుగుతుందని ఇటీవల మీర్పేట్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన వివాదానికి మేయర్ కి ఎలాంటి సంబంధం లేదని మేయర్ భర్త దీపు లాల్ చౌహాన్ అన్నారు.  శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గోన్నారు. దీపులాల్ చౌహన్ మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధి కోసం మేయర్,మంత్రి సబితా ఇంద్రారెడ్డి అహర్నిశలు కృషి  చేస్తున్నారని అన్నారు. 29వ డివిజన్ బిజెపి పార్టీ కార్పొరేటర్ నీలా రవి నాయక్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని,బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ అభివృదే ధ్యేయంగా పని చేస్తున్నామని  అన్నారు. నిరాధారమైన,అసత్య ఆరోపణలు మేయర్ పై కార్పొరేటర్ చేయడం తగదని అన్నారు. కార్పొరేటర్ రాజకీయాల మీద కాకుండా తన డివిజన్ అభివృద్ధి పై శ్రద్ధ పెట్టాలని అన్నారు. కార్పొరేషన్ లో ఎలాంటి సమస్య ఉన్న మేయర్ దృష్టికి తీసుకోవచి, పరిష్కరించుకోవచ్చని అన్నారు.

Related Posts