YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వ్యూహకర్తలం..అద్భుతాలు చేస్తాం..

వ్యూహకర్తలం..అద్భుతాలు చేస్తాం..

జనసేన పార్టీ వాసుదేవ్ ను తమ వ్యూహకర్తగా నియమించుకోవడంతో అందరి దృష్టీ ఈ విభాగంపై పడింది. ఎందుకంటే ఇటీవలిగా చాలా పార్టీలు ప్రత్యేకంగా వ్యూహకర్తలను నియమించుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు కృషి చేస్తున్నాయి. దీంతో వ్యూహకర్తలు ఏం చేస్తారు? పార్టీల కోసం ఎలాంటి గెలుపు ఫార్ములాలు రచిస్తారు? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. నాలుగేళ్లుగా పొలిటికల్ స్ట్రాటజిస్టుల హల్ చల్ ఎక్కువైపోయింది. సీనియర్, జూనియర్ తేడా లేదు. పార్టీలు, నేతలు కూడా వ్యూహకర్తలు నియమించుకుంటున్నారు. అన్ని పార్టీల స్థితిగతులు, ప్రజల ఆలోచనలు, దృక్పథాలు గుర్తించి.. తమ పార్టీ ఎలా ఉంటే బాగుంటుందో ప్రణాళికలు రచిస్తారు వ్యూహకర్తలు. వీరి డ్యూటీ టోటల్ గా.. నాయకుడి తరఫున ఆలోచించి, వారిని గెలిపించగలిగే వ్యూహాలను రూపొందించడమే. 

 

రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే తరహా వ్యూహం పనిచేయదు. పరిస్థితులను బట్టి వ్యూహాలను మార్చుకోవాలి. గత తరంతో పోల్చితే ఈ తరం నాయకులకు రాజకీయ అనుభవం తక్కువ. వివిధ కారణాలతో రాజకీయాల్లోకి వస్తున్న యువ నేతలు క్షేత్ర స్థాయిలో ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలం అవుతుంటారు. ఇటువంటి వారి కోసమే వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యూహకర్తలు సంప్రదాయ రాజకీయానికి భిన్నంగా ప్లాన్లు రూపొందిస్తున్నారు. దాదాపు అన్ని పార్టీలూ ప్రజాసంక్షేమం గురించే మాట్లాడేలా చేస్తున్నారు. తమ పక్షాన నిలబడతారని విశ్వసించిన పార్టీకే ప్రజలు ఓట్లు వేస్తారు. అందుకే.. ఈ దిశగా పొలిటికల్ పార్టీలను సిద్ధం చేస్తున్నారు.

పురణేతిహాసాల కాలం నుంచే వ్యూహకర్తలు ఉన్నారు. రాచ కుటుంబాల్లోనే కాక వివిధ రంగాల్లోనూ వీరి ఉనికి ఉంది. పాలనలోనే కాక యుద్ధతంత్రాలపై వీరు సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. ప్రస్తుతం రాచరిక వ్యవస్థ పోయింది. ప్రపంచంలోని అనేకదేశాల్లో ప్రజాస్వామ్యానిదే హవా. అయితే రాజులు పోయినా.. వ్యూహకర్తల ఇమేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుత పొలిటికల్ ట్రెండ్ కు తగ్గట్లుగా రాజకీయ పార్టీలకు వ్యూహ రచనలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ తెలుగురాష్ట్రాల్లోనూ జోరుగానే ఉంది. ప్రతీ పార్టీ వ్యూహకర్తలను నియమించుకుని ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీలకు వ్యూహకర్తలు ఉండటం ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువ. కానీ తెలుగు రాష్ట్రాలకు మాత్రం రావడం వైసీపీతోనే మొదలైందని చెప్పొచ్చు. ఇక జనసేన కూడా ప్రత్యేకంగా వ్యూహకర్తలను నియమించుకోవడంతో ఆంధ్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. 

Related Posts