YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దళితబంధు రాష్ట్రమంతటా అమలు చేయాలి

దళితబంధు రాష్ట్రమంతటా అమలు చేయాలి

దళితబంధు రాష్ట్రమంతటా అమలు చేయాలి
 హైదరాబాద్
దళితబందు తో దళితులను కేసీఆర్ దగా చేస్తున్నారు.  దళితుడిని ముఖ్యమంత్రి చేయకుంటే తల నరుక్కుంటా అన్న కేసీఆర్, దళితున్ని ఎందుకు ముఖ్యమంత్రి చేయాలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతా రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కనీసం ఉప ముఖ్యమంత్రి గా అయినా జలితునికి అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి... తీసేసారు. దళితుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ యస్సీ సబ్ ప్లాన్ ను తీసుకువచ్చింది. యస్సీ సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధులు మళ్ళించారు. ప్రతీ దళిత కుటుంబానికి పది లక్షలు ఇస్తా అంటుంన్న కేసీఆర్... ఇప్పటి వరకు సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధులు ఎందుకు ఖర్చు చేయలేదని ఆమె అన్నారు.చదువుకున్న పేద దళితులు చిన్న వ్యాపారాలు పెట్టుంకుంటాం అంటే కూడా రూపాయి ఇవ్వని కేసీఆర్.. పది లక్షలు ఇస్తడా. పది లక్షలు ఇచ్చే ముందు.. ఇప్పటి వరకు దళితుల కోసం కేటాయించిన నిధులు , పథకాలు అమలు చేయాలి. దలితులకు 3 ఎకరాల భూమి ఎప్పుడు ఇస్తారు. తెలంగాణ లో సెంటు భూమి లేని దళిత కుటుంబాలు దాదాపు 3 లక్షలు ఉంటాయి. వీరందరికీ భూమి ఇచ్చేది ఎప్పుడు. పాత పథకాలు అమలు చేయకుండానే కొత్త పథకాలా. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ను పట్టించుకోని కేసీఆర్.. కొత్త స్టడీ సర్కిల్ లు ఏర్పాటు చేస్తరట అని ఆమె అన్నారు.అంబేద్కర్ వర్దంతి కి గాని ,జయంతి కి గాని  కేసీఆర్ ఏరోజైన ఓక దండ వేసారా. దళిత బందు ను హుజూరాబాద్ లో నే కాదు రాష్ట్రం మొత్తం ఒకే  సారి ఇవ్వాలని అన్నారు.  హుజూరాబాద్ ను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంచుకున్నారంటనే అర్థం అవుతుంది.. ఇది ఎలక్షన్ స్టంట్ అని . అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహం ఎందుకు పెట్టలేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవకపోతే..మీకు దళిత బందు ఉండదని దళితులను బెదిరిస్తున్నారు.. హుజూరాబాద్  ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ మినహా రాష్ట్రంమొత్తం  దళితబంద్   అమలు చేయాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్  , ఎన్నికల అధికారి కి లేఖ రాసారు ..ఇది వారి వ్యక్తి గత అభిప్రాయంమని ఆమె అన్నారు...

Related Posts