అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పై మిజోరం రాష్ట్రంలో పోలీసుల కేసు
మిజోరం జూలై 31
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తో పాటు ఆ రాష్ట్రానికి చెందిన మరో ఆరుగురు అధికారులపై మిజోరం రాష్ట్రంలో పోలీసు కేసు నమోదు అయ్యింది. హత్యాయత్నం, దాడి కింద ఆ కేసులను బుక్ చేశారు. ఈశాన్య భారతానికి చెందిన ఆ రెండు రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజుల నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. గత వారం సరిహద్దు వద్ద జరిగిన కాల్పుల్లో అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు మృతిచెందిన విషయం తెలిసిందే. అస్సాం ఐజీపీ అనురాగ్ అగర్వాల్, డీఐజీ దేవజ్యోత్ ముఖర్జీ, కాచర్ ఎస్సై చంద్రకాంత్, ధోలియా పోలీస్ స్టేషన్ ఇంచార్జీ సాహెబ్ ఉదిన్‌పై మీజోరం పోలీసులు కేసు దాఖలు చేశారు. ఐపీసీలోని 307/120-B/270/325/326 and 353/336/ 334/448/34 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేవారు. నలుగురు పోలీసు, ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు మీజోరం ఐజీ సమన్లు జారీ చేశారు. అస్సాంలోని కచార్ జిల్లాతో సరిహద్దు కలిగి ఉన్న మీజోరంలోని కొలసిబ్ జిల్లాలోని వైరంటేగ్ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.