ఇకపై ఐదు భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు
న్యూఢిల్లీ
ఇకపై ఐదు భాషల్లో ఇంజినీరింగ్ కోర్సుల బోధన జరుగ నుండి. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కాలేజీలు హిందీతోపాటు తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ ప్రాంతీయ భాషల్లో విద్యను అందిన్చానున్నారు.ఇంజనీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లో అనువదించడానికి ఒక సాధనాన్ని కూడా అభివృద్ధి చేసారు. పేదలు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతులకు ఇది ఎంతగానో సహాయపడనుంది. 1వ తరగతి విద్యార్థుల కోసం విద్యాప్రవేష్, సీబీఎస్‌ఈ స్కూళ్లలో 3,5,8వ తరగతుల కోసం అమలు చేసే సఫల్ కార్యక్రమం, దివ్యాంగుల కోసం పాఠ్యాంశంగా భారతీయ సంకేత భాష, నిష్ట 2.0, ప్రజల అవగాహన కోసం ఏఐ వెబ్‌సైట్, అకాడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, ప్రాంతీయ భాషల్లో 1వ సంవత్సరం ఇంజనీరింగ్ కార్యక్రమాలు,ఎన్‌డిఎఆర్ & ఎన్‌టిఎఫ్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కార్యక్రమం మన యువకుల భవిష్యత్‌కు ఆధారంగా నిలుస్తుందని, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థను సృస్తిన్చనుంది..