YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రెచ్చిపోతున్న ఇసుకాసురులు

రెచ్చిపోతున్న ఇసుకాసురులు

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నా అక్రమార్కుల్లో మార్పు రావడంలేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనూ ఈ దందా జోరుగా సాగుతోంది. కొందరు సొంత అవసరాల కోసమని, మరికొందరు ప్రభుత్వ పనుల కోసం అంటూ ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. లేటెస్ట్ గా ఇసుక మాఫియా కొత్తగా మరో మార్గాన్ని ఎంచుకొని అక్రమ ఇసుక వ్యాపారాన్ని జోరుగా నిర్వహిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. అటవీశాఖ పరిధిలోకి వచ్చే భూమలను లక్ష్యంగా చేసుకొని యథేచ్ఛగాఇసుక తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పగలు రవాణా చేస్తే అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల నుంచి ఇబ్బందులు వస్తాయన్న భావనతో రాత్రి సమయాల్లో రవాణా చేస్తున్నారని అంటున్నారు. కొల్లాపూర్‌ మండలం మొలిచింతలపల్లి వాగులో ఈ దందా అధికంగా ఉన్నట్లు చెప్తున్నారు.

 

మొలిచింతలపల్లి వాగులో ఏటా ఇసుక నిల్వలు  భారీగా పెరుగుతున్నాయి. అక్రమ ఇసుక వ్యాపారులు మాత్రం ఎండాకాలం రాగానే ఈ ఇసుకను పూర్తిగా తోడేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయరు పూర్తి స్థాయిలో నిండినప్పుడు నీటి ప్రవాహానికి ఇసుక మెట్టలు పెద్ద ఎత్తున ఇక్కడి ప్రాంతానికి కొట్టు వస్తుంటాయి. ఎండాకాలంలో నీటి మట్టం తగ్గేకొద్ది ఇసుక నిల్వలు భారీగా బయటపడుతున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి కొట్టుకొచ్చిన ఇసుక కూడా ఇక్కడే పేరుకుపోతోంది. దీంతో అక్రమార్కులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇక ఈ ఇసుక నాణ్యమైంది కావడంతో మార్కెట్లో మంచి డిమాండ్‌ పలుకుతోంది. దీంతో ఇక్కడి ఇసుక విక్రయాల ద్వారా అక్రమార్కులు రూ.లక్షలు దండుకుంటున్నారని అంతా అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దందాకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. లేదంటే విలువైన ప్రకృతి సంపద అన్యాక్రాంతమవడంతో పాటూ ప్రభుత్వాదాయానికి భారిగా గండి పడుతుందని హెచ్చరిస్తున్నారు.

Related Posts