YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మార్కెట్ లో మాయాజాలం!

మార్కెట్ లో మాయాజాలం!

నిజామాబాద్‌లోని గాంధీ గంజ్ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో వ్యాపారుల మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. శ్రద్ధనంద్ గంజ్ లో మరో దుకాణాల సముదాయం ఏర్పాటుచేసింది. సుమారు రూ.కోటి ఖర్చు చేసి రైతులకు మద్దతుగా నిర్మించినా ఈ దుకాణాల్లోనూ అక్రమాలు సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు సరైన ధర దక్కడంలేదని రైతులు వాపోతున్నారు. ఇటీవలే ఓ రైతు మార్కెట్ కు కొత్తిమీర తీసుకొచ్చారు... కిలో రూ. 20-25 ధర పలకగా బుధవారం మాత్రం రూ. 10-15 లోపే అమ్ముడైంది. బయట మార్కెట్‌లో మాత్రం కిలో రూ. 40 పలుకుతోంది. 62 ఎకరాలు ఉన్న శ్రద్ధానంద్‌ గంజ్‌లో ప్రతి మూలన సీసీ కెమెరాలున్నాయి. కానీ కొత్తగా నిర్మించిన హోల్‌సేల్‌ కూరగాయల దుకాణాల వద్ద మాత్రం వీటిని ఏర్పాటు చేయలేదు. ఎన్ని వాహనాలు సరకుతో లోపలికి వస్తున్నాయి? ఎంత క్రయవిక్రయాలు నడుస్తున్నాయనే విషయమై స్పష్టత లేదు. దీంతో షరా మామూలుగానే రైతులు దగా పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.   

 

రైతుల పేరుతో కొంత మంది వ్యాపారులు మెసాలు చేస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. సరకు తీసుకొచ్చి నేరుగా వినియోగదారులకు అంటగడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. తాము పండించిన పంటనే తెచ్చామని చెప్తూ విక్రయాలు సాగిస్తున్నారని చెప్తున్నారు. ఈ మార్కెట్ లో రైతు ఎవరో..? వ్యాపారి ఎవరో వినియోగదారులు గుర్తించలేపోతున్నారు. ఈ మార్కెట్‌ను అనుకొనే మరికొందరు కొత్తగా మడిగెలు నిర్మించుకొని దర్జాగా కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ పరిస్థితి అంతా పరిశీలిస్తే.. కొత్త మార్కెట్ లోనూ పాత విధానమే నడుస్తోందన్న విషయం తేటతెల్లమవుతుందని రైతులు స్పష్టంచేస్తున్నారు. ఇదిలాఉంటే సందడిగా ఉండే ఈ మార్కెట్‌లో తరచూ చోరీలు జరుగుతుండడం రైతులను కలవరపరుస్తోంది. ఈ సమస్యలపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్ లో పరిస్థితులు చక్కదిద్దాలని, నిబంధనల ప్రకారం వ్యాపారాలు సాగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అంతేకాక మార్కెట్ అంతటా భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts