YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రెవిన్యూ వర్సెస్ అటవీ శాఖ

రెవిన్యూ  వర్సెస్ అటవీ శాఖ

వరంగల్, ఆగస్టు 2, 
జిల్లాలోని భూపాల్‌పల్లి మండలం ఆజాంనగర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలోని కోనంపేట, నాగారం శివారులో గల భూమి మాదంటే మాది అంటూ రెవెన్యూ శాఖ, అటవీశాఖ వారు వాదించుకుంటున్నారు. కోనంపేట గ్రామ పాఠశాలకు ఆనుకుని ఉన్న సర్వేనెంబర్ 487లోని పది ఎకరాల భూమిలో బృహత్ పల్లె ప్రకృతి వనం కార్యక్రమాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రారంభించారు. ఈ భూమిలో పల్లె ప్రకృతి వనాన్ని జిల్లాకే ఆదర్శంగా పెంచాలని కలెక్టర్ మండల పరిషత్ అధికారులు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం రోజు ఆ భూమిలో పనులు ప్రారంభించడానికి మండల పరిషత్ సిబ్బంది రెవెన్యూ అక్కడికి వెళ్లారు. ఇది గమనించిన అటవీశాఖ అధికారులు ఈ భూమి అటవీశాఖకు చెందినదని ఇందులో రెవెన్యూ వారు గానీ పంచాయతీరాజ్ వారు గానీ ఎలాంటి పనులు చేయకూడదు అని, పనులు చేస్తున్న జేసీబీ యంత్రాన్ని అడ్డుకున్నారు.అంతేగాక ఆజాంనగర్ అటవీశాఖ అధికారి మండల్ పరిషత్ అధికారికి ఈ భూమి తమదే అంటూ, ఇందులో ఎలాంటి పనులు చేయాలని నోటీసు సైతం అందజేశారు. దీంతో రెవెన్యూ పంచాయతీ శాఖ వారు చేసేదేమీలేక వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ విషయమై మండల పరిషత్ అధికారి జిల్లా అదనపు కలెక్టర్ ను సంప్రదించగా.. అటవీ శాఖ వారికి నోటీసులు ఇచ్చి పనులు చేయాలని చెప్పినట్లు తెలిసింది. కాగా ప్రభుత్వంలోని రెండు శాఖల వారు భూమి మాదంటే మాదని అభివృద్ధి పనులను అడ్డుకోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భూమి ఎవరిదనేది అటవీశాఖ వారు రెవెన్యూ శాఖ వారు సర్వే చేయించి పనులు ప్రారంభించకుండా, అనాలోచితంగా పనులు చేయడమేంటని పలువురు అధికారులు పనితీరును విమర్శిస్తున్నారు.పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖ వారు ఆదివారం రోజు ప్రారంభించిన గృహ ప్రకృతి వనము భూమి రిజర్వ్ ఫారెస్ట్ లోని ఉన్నదని, కంపాక్ట్ 718 నెంబర్ లోని ఆజాంనగర్ రేంజ్ ఆఫీసర్ నరేష్ తెలిపారు. ఆ నెంబర్ లో 409 హెక్టార్ల భూమి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందని కమ్మ భూమిలో పంచాయతీరాజ్ శాఖ వారు ఎలా పని చేస్తారని అందుకే అడ్డుకున్నట్లు అని తెలిపారు.

Related Posts