YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను బహిష్కరించిన 68 మంది అవార్డు గ్రహీతలు

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను బహిష్కరించిన 68 మంది అవార్డు గ్రహీతలు

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను బహిష్కరిస్తున్నట్లు  పలువురు అవార్డు గ్రహీతలు వెల్లడించారు. 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదాన కార్యక్రమం ఈ సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 140 మంది అవార్డులకు ఎంపికయ్యారు. కాగా వీరిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా కేవలం11 మందికి మాత్రమే అవార్డు ప్రదానోత్సవం జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. మిగతావారికి కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ చర్యను తీవ్రంగా నిరసిస్తూ 68 మంది అవార్డు గ్రహీతలు వేడుకను బహిష్కరించారు. ఇది తమను అవమానించడమేనని పేర్కొన్నారు.రాష్ట్రపతి కేవలం11అవార్డులే అందజేస్తారని తమకు చివరి నిమిషంలో చెప్పడం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నారు. ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించే ఓ ప్రతిష్టాత్మక సంస్థ ముందుగానే ఇంత కీలక విషయాన్ని మాకు చెప్పకపోవడం ఓ నమ్మక ద్రోహంగా భావిస్తున్నాం. 65 ఏళ్ల సాంప్రదాయానికి తెరదించడం నిజంగా దురదృష్టకరమన్నారు. దీనిపై ఇప్పటికే స్మృతి ఇరానీతో మాట్లాడినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. సెర్మనీకి రాకుండా ఉండటం తప్ప మాకు మరో దారి లేదు. అవార్డుల సెర్మనీని బాయ్‌కాట్ చేసే ఉద్దేశం లేదు కానీ దానికి రాకుండా మా నిరసనను తెలుపుతున్నాం. ప్రముఖ సింగర్ కెజే యేసుదాసు, బెంగాళి ఫిల్మ్ మేకర్ కౌషిక్ గంగూలీ, నటుడు ఫహద్ ఫాసిల్ సంతకాలతో కూడిన ఓ లేఖను విడుదల చేశారు.

Related Posts