హైదరాబాద్, ఆగస్టు 2,
టాలీవుడ్ కేంద్రం హైదరాబాద్ గా మారింది. కేసీఆర్ కు దక్కే గౌరవం ఏపీ సిఎం కు ఫిల్మ్ సర్కిల్స్ లో లేదన్నది స్పష్టమే. గతంలో చంద్రబాబు కు మాత్రం కేసీఆర్ తో సమానమైన గౌరవం దక్కేది. దాంతో సినీ అంశాలకు సంబంధించి వారికి అనుకూల నిర్ణయాలు ప్రకటించడం అవసరమా అన్న చర్చ వైసీపీ వర్గాల్లో ఉంది. వారి అభిమతానికి అనుగుణంగానే అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ ఒక నొక్కు నొక్కుతున్నారు అని ఆయన నిర్ణయాలు చెప్పక చెబుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రదర్శనల అంశంలో రెండు విధానాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ లో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తేయడంతో అక్కడ సినిమాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. అయితే ఏపీ లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. దాంతో బాటు బిసి సెంటర్లలో టికెట్ల ధరలను బాగా తగ్గించింది ఏపీ ప్రభుత్వం. కరోనా ఆంక్షలు ఉన్నా సినీ పెద్దల అభ్యర్ధనతో థియేటర్ల ను ప్రారంభించుకోవడానికి అనుమతి ఇచ్చింది జగన్ సర్కార్. ఇటీవలే హీరో నాని, విప్లవ సినీ నిర్మాత ఆర్ నారాయణ మూర్తి వంటివారు ఓపెన్ గా ప్రభుత్వాలకు విజ్ఞప్తి తెలిసిందే. వారి విన్నపాలు థియేటర్లు మొదలు పెట్టుకోవొచ్చనే వరకు సర్కార్ ప్రకటించింది. కానీ రాత్రి కర్ఫ్యూ ఆగస్టు 14 వరకు కొనసాగిస్తామని ప్రకటించి ఎగ్జిబిటర్లకు షాక్ ఇచ్చింది. ఒక పక్క టికెట్ రేట్లు తగ్గించేశారు, మరోపక్క మూడు షో లకు మాత్రమే ఏపీ లో అనుమతి ఉంటుంది. అదీగాక 50 శాతం మాత్రమే టికెట్లు విక్రయించాలి.ఇక ఈ నేపథ్యంలో సినిమాలు విడుదల చేసినా ప్రయోజనం లేదన్నది నిర్మాతలకు ఎగ్జిబిటర్లకు క్లారిటీ వచ్చేసింది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుదల మళ్ళీ జరగడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. దాంతో వెండితెర వెలుగులు మరికొంతకాలం వుండవన్నది తేలిపోతుంది. ఇక ఓటిటి వేదికగానే సినిమాల విడుదలకు ఆస్కారం ఉంది. అయితే దీనివల్ల స్టార్ డం లు ఢమాల్ మననున్నాయి. అనేక చిత్రాలు ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్నా ప్రస్తుత పరిస్థితులకు నష్ట పోవడం ఖాయమన్న ఆందోళన వ్యక్తం చేషున్నాయి. ఇలా ముప్పిరిగొన్న సమస్యలకు తోడు జగన్ సర్కార్ అదను చూసి పెడుతున్న వాతలను టాలీవుడ్ ముందుగా గ్రహించి చలో జగన్ అనకపోతే చిక్కుల్లోనే ఉంటుందంటున్నారు విశ్లేషకులు.