YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు

సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు

నల్ల‌గొండ  ఆగష్టు 2

సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాల జ‌ల్లు నందికొండ‌, హాలియా మున్సిపాలిటీల‌కు రూ. 15 కోట్ల చొప్పున నిధులు ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ల‌ను అప్‌గ్రేడ్ చేస్తాం.
నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో ఇచ్చిన హామీల‌ను త‌ప్ప‌కుండా నెర‌వేర్చుతాన‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ‌ అభివృద్ధిపై సోమవారం హాలియా మార్కెట్‌యార్డులో సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో అద్భుత‌మైన విజ‌యాన్నిచ్చి ముందుకు న‌డిపించినందుకు ప్ర‌జ‌లంద‌రికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా సాగ‌ర్‌కు రావ‌డం ఆల‌స్య‌మైంద‌న్నారు. త‌న‌ను కూడా క‌రోనా విడిచిపెట్ట‌లేదు. ఎన్నిక‌లు అయిపోగానే ఇక్క‌డ‌కు రాలేక‌పోయాను. స‌మ‌స్య‌లు చాలా పెండింగ్‌లో ఉన్నాయి అని సీఎం తెలిపారు. నోముల భ‌గ‌త్ అనేక స‌మ‌స్య‌ల‌ను త‌న దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నిక‌ల సంద‌ర్భంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ‌చ్చి ప‌ని చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో చాలా స‌మ‌స్య‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆ ఎమ్మెల్యేలు రిపోర్టు ఇచ్చారు. గ్రామాల్లో పొలాల‌కు వెళ్లేందుకు కూడా స‌రిగా క‌ల్వ‌ర్టులు లేవ‌ని చెప్పారు. హాస్పిట‌ళ్ల ప‌రిస్థితి కూడా బాగాలేద‌ని చెప్పారు. హాలియా ప‌ట్ట‌ణాన్ని చూస్తేనే త‌మ స‌మ‌స్య అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పారు. హాలియాను అద్భుతంగా చేయాలి. ఇక్క‌డ రోడ్లు స‌రిగా లేవు. డ్రైనేజీ వ్య‌వ‌స్థ స‌రిగా లేదు. వాట‌న్నింటిని క్ర‌మ‌క్ర‌మంగా పూర్తి చేసుకుందాం అని కేసీఆర్ అన్నారు. నందికొండ మున్సిపాలిటీ క్వార్ట‌ర్స్‌తో పాటు ఇరిగేష‌న్ భూముల్లో ఉన్న‌వారిని క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాం. చెప్పిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ ఆ ఇండ్ల‌ను రెగ్యుల‌రైజ్ చేయాల‌ని కోరుతూ, హ‌క్కు ప‌త్రాలు ఇవ్వాల‌ని ఆదేశిస్తున్నాం. ఈ ప‌ని నెల రోజుల్లో పూర్త‌వుతుంద‌న్నారు.
నందికొండ‌, హాలియా మున్సిపాలిటీల‌కు రూ. 15 కోట్ల చొప్పున నిధులు
నందికొండ‌, హాలియా మున్సిపాలిటీకి నిధులు కావాల‌ని అడిగారు. హాలియాకు రూ. 15 కోట్లు, నందికొండ మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ మున్సిపాలిటీల అభివృద్ధికి మున్సిప‌ల్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించాల‌న్నారు.ఇక సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. సిబ్బంది, భ‌వ‌నం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామ‌న్నారు. మిని స్టేడియం కూడా మంజూరు చేస్తాం. ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయ‌తీరాజ్ రోడ్లు, క‌ల్వ‌ర్ట‌ల నిర్మాణానికి రూ. 120 కోట్ల‌ను మంజూరు చేస్తున్నాను. మొత్తంగా రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నాను అని తెలిపారు. రెడ్డి క‌ల్యాణ మండ‌పం కోసం గ‌తంలో గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఎంపీగా ఉన్న స‌మ‌యంలో కొన్ని ఫండ్స్ మంజూరు చేశారు. ఆ క‌ల్యాణ మండ‌పానికి స్థ‌లం కేటాయిస్తాం. షాదీఖానా కోసం కూడా స్థ‌లం కేటాయిస్తాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.గుర్రం పోడు ప్రాంతంలో ఒక లిఫ్ట్ పెట్టిన‌ట్లు అయితే ఐదారు గ్రామాల‌కు క‌లిపి 10 వేల ఎక‌రాల‌కు నీరు వ‌స్తుంద‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే గుర్రంపోడు లిఫ్ట్ స‌ర్వే చేప‌ట్టాల‌ని అధికారుల‌కు ఆదేశాలు ఇస్తాం. దీన్ని కూడా నెల్లిక‌ల్ లిఫ్ట్‌తో పాటు మంజూరు చేస్తామ‌న్నారు. దేవ‌ర‌కొండ‌లో ఐదు లిఫ్ట్‌లు మంజూరు చేశాం, మిర్యాల‌గూడ‌లో ఐదు లిఫ్ట్‌లు, న‌కిరేక‌ల్‌లో అయిటిపాముల వ‌ద్ద ఒక లిఫ్ట్‌తో పాటు ఈ జిల్లాకు మొత్తం 15 లిఫ్ట్‌లు మంజూరు చేయ‌డం జ‌రిగింది. లిఫ్ట్‌ల‌న్నింటినీ రాబోయే ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాల్లో పూర్తి చేసి జిల్లా ప్ర‌జ‌ల‌కు అందిస్తామ‌న్నారు.
ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ల‌ను అప్‌గ్రేడ్ చేస్తాం
రాష్ట్రంలో హాస్పిట‌ల్స్ ఆశించిన స్థాయిలో లేవు అని సీఎం తెలిపారు. ఆరోగ్య శాఖ ప‌నితీరును మెరుగుప‌ర్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ‌లోని అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఉన్న‌ 18 వేల బెడ్స్‌ను ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసుకునే బెడ్స్‌గా మార్చుకున్నాం. ఏడు కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను మంజూరు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో 33 జిల్లా కేంద్రాల్లో మెడిక‌ల్ కాలేజీల‌తో పాటు ప్ర‌తి కాలేజీలో 500 బెడ్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. హైద‌రాబాద్‌లో నాలుగు సూప‌ర్ స్పెషాలిటీ ఆస్‌ త్రుల‌ను నిర్మిస్తున్నాం. సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ‌లో మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నాం. సాగ‌ర్‌లో ఉన్న ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ల‌ను అప్‌గ్రేడ్ చేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించారు.

Related Posts