YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

షబ్బీర్ కుటుంబానికి ఈటల సహయం

షబ్బీర్ కుటుంబానికి ఈటల సహయం

షబ్బీర్ కుటుంబానికి ఈటల సహయం
కరీంనగర్

ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన షబ్బీర్ అనే యువకుని కుటుంబాన్నీ  బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సోమవారం పరామర్శించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్  మృతుని కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సంధర్బంగా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ మాట్లాడుతూ షబ్బీర్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడు ఎకరాల భూమి ఇవ్వాలి.  పేదరికంలో ఉన్న కుటుంబానికి టీఆరెఎస్ నాయకులు రూ.25లక్షలు ఇవ్వాలి.  ఉద్యమ కాలంలో షబీర్, అతని తండ్రి ఈటెల రాజేందర్ కు సహాకారం అందించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ది ఒక నియంత, రాక్షసుడు, యమధర్మరాజు పాలన. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వక పోవడం, చదువు కోసం చేసిన అప్పులు తీర్చలేక తల్లిదండ్రులకు భారమై ఆత్మహత్యలు చేసుకుంటుర్రు. షభీర్ చావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముర్ఖుడు కారణం.  నీళ్ళు, నిధులు, నియామకాలు అని చెప్పి విద్యార్థులను ఉద్యమం వైపు తీసుకు వెళ్ళాం.  శ్రీకాంత చారి నుండి మొదలుకొని 1200ల మంది బలి దానాలు చేసుకున్నారు. ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తామన్నరు కదా, ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి.  విద్యార్థుల భవిష్యత్తు కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మ హత్యలు పరిష్కారం కాదు.  భరి గీసి కొట్లాడి కేసీఆర్ కు కనువిప్పు కలిగించాలని వారన్నారు.

Related Posts