YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 పశ్చిమప్రాంతంలోని నీటి ప్రాజెక్టుల సాధనకై  భారీగా బైక్ ర్యాలీ యాత్ర 

 పశ్చిమప్రాంతంలోని నీటి ప్రాజెక్టుల సాధనకై  భారీగా బైక్ ర్యాలీ యాత్ర 

 పశ్చిమప్రాంతంలోని నీటి ప్రాజెక్టుల సాధనకై  భారీగా బైక్ ర్యాలీ యాత్ర   
రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ
కౌతాళం
కర్నూలు పశ్చిమప్రాంతంలోని నీటి ప్రాజెక్టుల సాధనకై పల్లె పల్లె కదులుదాం అంటూ సోమవారం  రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ (RCC) ఆధ్వర్యంలో కౌతాళం మండలం మేలిగనూరు నుండి ఆదోని ఆర్డీఓ ఆఫీసు వరకు భారీగా బైక్ ర్యాలీ యాత్రను నిర్వహించారు. కౌతాళం లో బిస్మిల్లా సర్కిల్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం  నందు విలేకరుల సమావేశం ఏర్పాట్లు నిర్వహించారు ..ఈ సందర్భంగా రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రామలింగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు లోకేష్,రాష్ట్ర నాయకులు నాగరాజు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో నీరు లేక ప్రజలు సుగ్గి కు,వలసలకు వెళ్లి కుటుంబ పోషణ భారంతో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటారున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న పులికనుమ ప్రోజెక్టు సామర్ధ్యాన్ని ఐదు టీఎంసీలకు పెంచాలని ,వేదవతి ప్రాజెక్టు సామర్ధ్యాన్ని 8 టీఎంసీ లకు పెంచి నిర్మించాలని,మేలిగానూరు దగ్గర 50 టీఎంసీ లతో వరద కాలువను నిర్మించి ఈ ప్రాంతానికి త్రాగునీరు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.పై డిమాండ్ల సాధనకై ,కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని కరువు,వలసలను నివారించాలని కోరుతూ సోమవారం  నిబంధనలు పాటిస్తూ కేవలం  10 బైక్ లతో మేలిగానూరు నుండి ఆదోని ఆర్డీఓ ఆఫీస్ వరకు బైక్ యాత్రను నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని రైతన్నలు,ప్రజలు,ప్రజాసంఘాలు మద్దతు తెలియజేసి విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశానికి రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహయ్య,ప్రగతిశీల మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సుజ్ఞానమ్మ, బి. సి.ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు గారు పాల్గొని తమ ప్రజాసంఘాల సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ యువజన వేదిక నాయకులు రవి వర్మ,నవీన్,అనిల్,శేఖర్,ప్రతాప్ పాల్గొన్నారు.
 

Related Posts