YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి
టిడిపి నాయకులు జెన్నీ రమణయ్య
నెల్లూరు
 రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జి అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు స్థానిక నెల్లూరు రూరల్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కి  ఉపాధి హామీ పనుల బిల్లులు వెంటనే చెల్లించాలని  రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య వినతి పత్రం అందజేశారు .ఈ సందర్భంగా జెన్నీ రమణయ్య మాట్లాడుతూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన కూడా ప్రభుత్వం  నరేగా బిల్లులు చెల్లించకపోవడం ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు నిదర్శనం అని అన్నారు.తక్షణమే నరేగా బిల్లులు  విడుదల చేసి కాంట్రాక్టర్లు ను ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వం పార్టీలకు అతీతంగా రాజకీయ కక్ష్యలు మానుకొని బిల్లులు చెల్లింపులు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి కార్యదర్శి ఊరందూరు సురేంద్రబాబు, మాలమహానాడు నాయకులు గంగాధర్,ఈధర శ్రీనివాసులు, ముస్లిం మైనార్టీ నాయకులు సాబీర్ ఖాన్,సారంగి గున్నయ్య, భాస్కర్ రెడ్డి, సురేష్ రెడ్డి, నరసింహులు, శశిధర్, ఆనంద్ ,చెంచయ్య, నవీన్, మోహన్ రావువెంకట్ రత్నం ,సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts