డైనమిక్ ఆటో హీమో థెరపీ ద్వారా కరోనా ఖతం
హోమియో పతి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్
హైదరాబాద్ ఆగష్టు 2
సుశిక్షితులైన పతి హోమియో వైద్యుడి పర్యవేక్షణ లో వాడిన హోమియో మందులు ఖచ్చితంగా కరోనా ను ఖతం చేస్తాయని హోమియో పతి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ గద్దె సుభాష్ చందర్ తో కలసి మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కరోనా కు హోమియో చక్కటి దివ్య ఔషధం గా ఉపయోగించవచ్చు ఆన్న విషయం అప్పుడే చెప్పిందని వివరించారు. కరోనా సమయంలో తాను రాష్ట్రం లోని జిల్లాల్లో బైక్ యాత్ర చేసి ఎంతో మంది కి ఉచితంగా మందులు పంపిణీ చేశానని అశోక్ వివరించారు. న్యూ లైఫ్ హోమియో కేర్ ద్వారా డాక్టర్ గద్దె సుభాష్ చందర్ ఆల్లోపతి వైద్య విధానం ను అధ్యయనం చేసినప్పటికీ కొన్ని మొండి జబ్బులు హోమియో పతి తోనే నయం అవుతున్నాయని అనుభవ పూర్వకంగా తెలుసుకొని, గత కొన్నాళ్లుగా డైనమిక్ ఆటో హీమో థెరపీ ద్వారా అద్భుతమైన వైద్య విధానం తో సేవలు అందిస్తున్నారనీ కొనియాడారు. డైనమిక్ ఆటో హీమో థెరపీ ద్వారా రోగుల కు ఖచ్చితమైన నమ్మకమైన వైద్యం చెయ్యడం దేశం లో ఒక్క గద్దె సుభాష్ చందర్ కే సాధ్యం అయ్యిందని వివరించారు. కరోనా ను 48 గంటల్లో ఖతం చేసిన కేసులు ఆయన వద్ద ఉన్నాయన్నారు.ఆసుపత్రులు,వైద్యులు కరోనా సమయంలో అసాధారణ సేవలు అందించారని, సుభాష్ చందర్ వైద్యం తెలంగాణ భాగ్యం అని అభివర్ణంచారు.హోమియో పతి వైద్యుల కు గర్వ కారణం గా నిలిచేలా సుభాష్ చందర్ వైద్య విధానం విభిన్నంగా, ఎంతో వైశిష్ట్యం తో కూడుకొన్నది అని స్పష్టం చేశారు. ప్రస్తుత తరుణం లో థర్డ్ వే వస్తున్నా నేపద్యం లో ప్రజలు మాస్కులు దరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. అనంతరం డాక్టర్ గద్దె సుభాష్ చందర్ మాట్లాడుతూ..హోమియో వైద్యం తో వైద్యులు ఇప్పటికే చక్కటి ఫలితాలు రాబడుతున్నారనీ, తాను అనుసరిస్తున్న డీ ఏ హెచ్ టీ వైద్య విధానం ద్వారా చికిత్స ల మీద నమ్మకం, జీవితం పై ఆశలు కోల్పోయిన వాళ్ళను కూడా తన దైన శైలిలో బాగుచేశానని చెప్పారు.కరోనా బారిన పడి ఇక మనం బతకం అని ఆందోళన చెందిన వాళ్ళను సైతం కరోనా గండం నుంచి గట్టేక్కించానని చెప్పారు.మధు మేహా వ్యాధి గ్రస్తులు ఇంకా దీర్ఘ కాలిక మొండి జబ్బుల తో ఎన్నో ఏళ్లుగా సతమతం అవుతున్న వారు కొందరు దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ వైద్యుల సిఫారసు మేరకు తన వద్ద చికిత్స తో నూతన జీవితం ఆరోగ్యంగా గడుపుతున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.