"పాల్లేటివ్ కేర్" వార్డ్ జిల్లా ఆస్పత్రిలో ప్రారంభం
అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కామారెడ్డి ఆగస్టు 02
కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో పాల్లేటివ్ కేర్ వార్డును సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ప్రారంభించారు. ఈ సందర్భంగా అంటు వ్యాధులు కానీ ఈ వ్యాధితో బాధపడుతున్న వారు క్యాన్సర్ మధుమేహం అధిక రక్తపోటు మొదలగు వాటిని సామాన్య ఉపశమనము కై ఈ వార్డులో చికిత్సలు అందచేయడం కొరకు ఏర్పాటు చేశారని ప్రజలకు ఉపయోగ పడతాయని తెలిపారు. ఈ సందర్భంగా డిఎమ్ హెచ్ ఓ డాక్టర్ పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్ తీవ్ర దశలో ఉన్న వారికి "అలాన హవనం" టీం ద్వారా ఇంటి వద్దనే మా ఆలనా టీంతో సేవలు అందజేయడం జరుగుతుందన్నారు. అత్యవసర చికిత్స అవసరమైన పరిధిలో వారికి వైద్య చికిత్సలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జగన్నాథ్ రెడ్డి ఎస్ కే టి ఆఫీసర్ డాక్టర్ సుస్మిత రాయ్ పిఓ కామారెడ్డి మరియు డాక్టర్ మౌనిక, చలపతి సిద్ధరామేశ్వర రావు, సుధాకర్ , శ్రీనివాస్ పాల్గొన్నారు.