జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు లో ఉంది
ఎస్పి శ్వేత రెడ్డి
కామారెడ్డి ఆగస్టు 02
కామారెడ్డి జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే ముందుగా పోలీసులు అనుమతులు తీసుకోవాలన్నారు. పోలీసుల అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కావున జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.