YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉపాధి హామీ పెడింగ్ బిల్లులు విడుదల చేయాలి..

ఉపాధి హామీ పెడింగ్ బిల్లులు విడుదల చేయాలి..

ఉపాధి హామీ పెడింగ్ బిల్లులు విడుదల చేయాలి..
ఉపాధి హామీ బిల్లులపై టిడిపి నిరసన కార్యక్రమం..
నందికొట్కూరు. ఆగష్టు 02
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో  సోమవారం నందికొట్కూరు పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలోని ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు  టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు.అందులో భాగంగానే నంద్యాల పార్లమెంటు తెలుగు దేశం పార్టీ ఇంచార్జీ మాండ్ర శివా నంద రెడ్డి, నంద్యాల పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపు మేరకు పెండింగ్ బిల్లులకు సంబంధించి 5 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్నినందికొట్కూరు ఎంపీడీవో కార్యాలయంలో టిడిపి నాయకులు అందజేశారు.  కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూలై నెలాఖరు లోపల ఉపాధి హామీ బిల్లులు చెల్లించాల్సీ ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని హైకోర్టు ఆదేశాలను పాటించి పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులను సత్వరమే ప్రభుత్వం చెల్లించాలని  పగిడ్యాల  మండల  తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు పలుచాని మహేశ్వర రెడ్డి, నందికొట్కూరు  మండల టిడిపి కమిటీ సభ్యులు  జయసూర్య, కన్వీనర్ ఓబుల్ రెడ్డి లు డిమాండ్ చేశారు .
గత టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉపాధి హామీ బిల్లులను వైసిపి ప్రభుత్వం చెల్లించకుండా కుంటి సాకులు చెపుతూ పబ్బం గడుపుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు రాష్ట్ర వైసిపి ప్రభుత్వానికి పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులను జులై 31లోపు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో నిధులు వినియోగం, పనిదినాలకల్పన , అభివృద్ధిలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులను తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఏపీ నిలిచేటట్లు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  అహర్నిశలు కృషి చేశారన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద సుమారు రూ, 6125 కోట్ల నిధులతో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఎల్ ఈ డి దీపాలు, గ్రామ పంచాయితీ భవనాలు, స్మశాన వాటికలు, నీరు చెట్టు, పంటకుంటలు, అంగన్ వాడి కేంద్రాలు, చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలు  వంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించారన్నారు. రూ, 5694 కోట్ల తో సుమారు 40వేల కిలోమీటర్ల సిసి రోడ్లు, గ్రావెల్ రోడ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు..వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చాక ఏపీ లోని గ్రామాల అభివృద్ధికి గ్రహణం పట్టిందని, వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జి ఓ నంబర్ 350 తెచ్చి గ్రామాల్లో సుమారు రూ, 3118 కోట్ల విలువైన పనులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయడం సిగ్గు చేటన్నారు.  ఇది పూర్తిగా ఉపాధి హామీ  . చట్టం 2005 ప్రకారం విరుద్ధమన్నారు. ఈ చట్టం ప్రకారం  వరుస క్రమంలో బిల్లుల చెల్లింపులు చేపట్టాలి.
పెండింగ్ బిల్లులకు విజిలెన్స్ విచారణ పేరుతొ చెల్లించకుండా నిధులు లేవు, కేంద్రం ఇవ్వలేదు అని ఏవో కుంటి సాకులు చెప్తూన్న వైసిపి దుర్మార్గపు ఆలోచనలకు పరాకాష్ట అని మండి పడ్డారు.కోర్టు ఆదేశాలను అనుసరించి పెండింగ్ లో ఉన్న  ఉపాధి బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ నందికొట్కూరు  ఎంపిడిఓ కార్యాలయం లో సూపర్ డెంట్ రాజశేఖర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమం లో మున్సిపల్ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి,తెలుగు యువత అధ్యక్షులు మద్దిలేటి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ముర్తు జావళి, టిడిపి నాయకులు వేణు, సత్తార్, కళా కర్, మల్లికార్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts