YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తహసీల్దార్ అవినీతి, అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

తహసీల్దార్ అవినీతి, అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

తహసీల్దార్ అవినీతి, అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
 అవినీతికి సంబంధించి అంశాలు  సమర్పణ
 నెల్లూరు
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే సాదా బైనామాల పేరుతో మ్యూటేషన్లు, ప్రభుత్వ భూములు, చెరువు పొరంబొకు భూములకు కూడా పట్టాదారు పాసుపుస్తకాల జారీ, పీఏసీఎస్ లో  తనఖాలో ఉన్న భూములకు మరొకరి పేరుతో పట్టాదారు పాసుపుస్తకాల జారీ, గయాలు భూములకు కూడా పట్టాదారు పాసు పుస్తకాలు, వివాదాలతో కోర్టులో పెండింగ్ లో ఉన్న భూములకు కూడా మ్యూటేషన్ చేయడం తదితర అంశాలకు సంబంధించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ అనుమతి లేకుండానే వీఆర్ఏలకు పోస్టింగ్ లు ఇవ్వడం, వివాదాస్పదం కాగానే ఆ ఉత్తర్వులు చించేసిన అంశాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు.
అవినీతిని వెలుగులోకి తెచ్చిన తర్వాత కొన్ని ఖాతా నంబర్లను ఆన్ లైన్ లో నుంచి తొలగిస్తున్న అంశాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తెచ్చారు.మ్యూటేషన్ నిమిత్తం ఒక్కో ఎకరాకు రూ.50 వేలు తీసుకున్నారని, కొన్ని భూములకు సంబంధించి నకిలీ పాసు పుస్తకాలు కూడా సృష్టించారని ఫిర్యాదులో ఆధారాలతో సమర్పించారు.అధికార పార్టీ అండదండలతోనే భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, సమగ్ర విచారణ జరిపి తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఉన్నతాధికారులు స్పందించి తహసీల్దార్ అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకునేంత వరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని, తహసీల్దార్ అక్రమాల బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. తహసీల్దార్ అక్రమాలపై టీడీపీ చేయతలపెట్టిన నిరాహార దీక్షలను అడ్డుకునేందుకే జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పొదలకూరులో మధ్యాహ్నం ఒంటి గంట నుంచే లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
కార్యక్రమంలో  టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, అక్కెం సుధాకర్ రెడ్డి, యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, నీలం సుందరరామిరెడ్డి, అలుపూరు శ్రీనువాసులు, సద్ది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts