ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష
కడప
నగరము లోని నిరుపేదలు నివసించే ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు విరివిగా ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా అన్నారు. ఆది వారం లాల్బడి అగాడిలో కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అగాడి, సాయిపేట, అఫ్సర్ ఖాన్ వీధి ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇస్లా మిక్ సొసైటీ వారు తమ సేవలను రాష్ట్ర స్థాయిలో విస్తరింపజేయాలని కోరారు. సొసైటీ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ అహ్మద్(బాబూ బాయ్) మాట్లాడుతూ సొసైటీ తరఫున అట్లూరులో, కడపలో వరదలు వచ్చి నప్పుడు సహాయ చర్యలు చేపట్టామన్నారు. అగా డిలోని పేదల కోసం మెటర్నిటీ హాస్పిటల్ కట్టించేం దుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ జనాబ్ ఇసాక్ అలీ, వైఎస్సార్సీపీ నాయకులు బసవరాజు, జహీర్,సొసైటీ ప్రధాన కార్యదర్శి ముక్తార్ అహ్మద్, మజర్ అలీఖాన్, దాసరి శివ, రామచంద్రయ్య, డా. సొహైల్ అహ్మద్, మదుసూదన్రెడ్డి పాల్గొన్నారు.