YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది - ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది - ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
రైతులకు సాగు ఖర్చులు తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ  మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గురువారం నాడు మైలవరం మార్కెట్ యార్డులో జరిగిన గ్రామ భారత ప్రభుత్వ స్వరాజ్య అభియాన్ - కిసాన్ కళ్యాణ్ కార్యశాల లో మంత్రి  పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ పథకాలను ఉపయోగిoచుకుని రైతులు అధునాతన విధానాలను, పనిముట్లను కొనుగోలు చేసుకుని వృద్దిపధంలో సాగాలని కోరారు. పంటలకు మద్దతు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోoదని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయ, రెవిన్యూ, హార్టికల్చర్ అన్ని విభాగాల అధికారులు గ్రామాల్లో ఉండి రైతులకు అండగా నిలవాలని మంత్రి ఆదేశించారు. పుల్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వచ్చే జూన్లో పూర్తిచేస్తామని మంత్రి చెప్పారు. చింతలపూడి పనులు వేగంగా జరుగుతున్నాయని, రైతులతో పాటు, ప్రజలంతా సాగునీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించాలని కోరారు. ఆంధ్రుల దశాబ్దాల కల పోలవరం త్వరలోనే సాకారం కాబోతోంది, 23లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటికే 6 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేశామని మంత్రి తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు ముఖ్యమంత్రులు చేయలేని భూసేకరణ పరిహారం చెల్లింపు కార్యక్రమాలను పూర్తి చేస్తూ ముందుకు వెళుతున్నామని, ఈ సంవత్సరంలోనే గ్రావిటీ ద్వారా నీరిస్తామని మంత్రి చెప్పారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత మైలవరం చెరువుకి నీళ్లొచ్చాయని ఇది పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించడంవల్లే సాధ్యమైనదని, కానీ ప్రతిపక్ష నేత మాత్రం బాద్యతారహితంగా మాట్లాడటమేగాక, కుట్రలు, కుతంత్రాలతో కోర్టుల్లో కేసులు వేయించి ప్రాజెక్టులు ముందుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని మంత్రి ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధునిక పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించిన ఉత్తమ రైతులకు మంత్రి ఈ సందర్బగా ప్రశంసా పత్రాలు అందించి సత్కరించారు.  వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ), మైలవరం బ్లాక్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేకమంది రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Related Posts