YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నామినేటెడ్ పదవుల్లో నూర్ బాషలకు అవకాశం ఇవ్వాలి నూర్ భాషా దూదేకుల వర్గాల డిమాండ్

నామినేటెడ్ పదవుల్లో నూర్ బాషలకు అవకాశం ఇవ్వాలి నూర్ భాషా దూదేకుల వర్గాల డిమాండ్

నామినేటెడ్ పదవుల్లో నూర్ బాషలకు అవకాశం ఇవ్వాలి
నూర్ భాషా దూదేకుల వర్గాల డిమాండ్
 నెల్లూరు
రాష్ట్ర ప్రభుత్వం బిసి వర్గాలకు కల్పిస్తున్న కార్పొరేషన్ తదితర నామినేటెడ్ పదవుల్లో నూర్ భాషా, దూదేకుల వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ దేశ్ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల బి.సి.ముస్లిం సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు షేక్ సలీం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులు, ప్రాంతీయ సమన్వయ కర్త సజ్జల రామకృష్ణ రెడ్డి ని కోరారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం నెల్లూరు నగరంలోని రోడ్డు భవనాల శాఖ అతిథిగృహంలో సజ్జలను సలీం కలిసి ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు.
నెల్లూరు జిల్లాలో ఉన్న  47 మండలాల లో  దాదాపు 1.50 లక్షల మంది నూర్ భాషా దూదేకుల కులస్తులు ఉన్నారని 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్   పార్టీ గెలుపుకోసం  జిల్లా లో ఉన్న 10 నియోజక  వర్గాలలో నూరుబాషా కమిటీ పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడం జరిగినదాని చెప్పారు. 2020 లో ప్రతి బి సి కులము నుండి 30 వేల  జనాభా ఉన్న వారికీ రాష్ట్రములో 56 కార్పొరేషన్లు ఏర్పాటు  చేసి , చెర్మైన్ లు , డైరెక్టర్ లను నియమించడము జరిగినదనీ ఐతే  1.50 లక్షల మంది జనాభా కలిగిన నూరుబాషా లు ఉన్న నెల్లూరు జిల్లాకి సంబంధించి ఒక్క డైరెక్టర్ కూడా  నియమించలేదని సలీం వివరించారు.స్వాతంత్రము వచ్చి 75 సంవత్త్రములు అయినప్పటికీ  నూరుబాషా లకు చట్ట సభలలో కానీ , నామినేటెడ్ పదవులలో కానీ సరైన అవకాశములు కల్పించక పోవడము వలన తమ  ఉనికిని క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకులకు తెలియబరచ లేక ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికి ఐన పునాలోచన చేసి  నూరుబాషాలకు తగిన ప్రాధాన్యతను కల్పించాల్సిందిగా అయన విజ్ఞప్తి చేశారు , ప్రభుత్వము నియమించు వక్ బోర్డు  , ముస్లిం మైనారిటీ , హజ్ కమిటీ  , మరియు ఏ ఇతర నామినేటెడ్ పదవులలో , ముస్లింలతో పాటు  దామాషా ప్రకారము తమకు కూడా  చైర్మన్ , డైరెక్టర్లు గ నియమించే లా కృషి చేయాలని సలీం కోరారు. ఈ సంధర్భంగా సలీం సభ్యులకు పూల గుత్తులు అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

Related Posts