ఏపి లో కొత్త వరవడి.. బోనాల ఉత్సవానికి శ్రీకారం
అత్తిలి లో శ్రీ మహంకాళి అమ్మవారికి శ్రద్దలతో బోనాల సమర్పణ
అమరావతి/హైదరాబాద్ ఆగష్టు 2
తెలంగాణా రాష్ట్రము లో ఎంతో ఘనంగా నిర్వహించే బోనాల ఉత్సవం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో సహితం ఘనంగా నిర్వహించారు.ఆషాడ మాసం లో మహంకాళి (పోచమ్మ)అమ్మవారిని కొలవడం వల్ల శుబాలు కలుగుతాయని నమ్మకం తో తెలంగాణా లో బోనాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంస్కృతి ప్రక్క రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్ లో కుడా నిర్వహించడం ఆ ప్రాంత ప్రజల్లో అమ్మవారి పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనం అని చెప్పవచ్చు.ఈ ప్రాంతానికి ఆప్రాంతానికి బోనాల ఉత్సవం నిర్వహణలో కొంత తేడా ఉన్నప్పటికీ భావం మాత్రం ఒక్కటే నన్నది సుస్పష్టం.పచ్చిమ గోదావరి జిల్లా అత్తిలి లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో మహిళలు భక్తి శ్రద్దలతో బోనాలను సమర్పించి కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు..ఈ సందర్బంగా శ్రీ శక్తి మహా ఫీటం అధ్యక్షురాలు గాదె మంగామణి నేతృత్వం లో 30 మహిళలు బోనాలను సమర్పించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రాంతం వేరైనా దేవత ఒక్కరేనని మహంకాళి అమ్మవారిని కొలవడం వల్ల శుబాలు కలుగుతాయని నమ్మకం తో తెలంగాణా తరహాలో బోనాలను సమర్పించి నట్లు తెలిపారు. ఇది మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమం లో కే.లక్ష్మి, చోలుమురి కరుణ, పబ్బరి వెంకట లక్ష్మి, గాదె సత్యవతి తదితరులు పాల్గొన్నారు.