YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ కట్టడి ఎలా..

రేవంత్ కట్టడి ఎలా..

హైదరాబాద్, ఆగస్టు 3, 
శత్రవు బలమైనోడయితే ముందు నుంచే అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం చేసి కిందకు నీళ్లు తెచ్చుకోకూడదు. ఏ చిన్న అవకాశమిచ్చినా శత్రువు మరింత బలపడే అవకాశముంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి విషయంలో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీల ఆలోచన ఇదే. రేవంత్ రెడ్డిని తొలి దశలోనే దెబ్బతీయాలన్నది వారి లక్ష్యంగా కన్పిస్తుంది. అందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను చావుదెబ్బతీయాలన్న ప్లాన్ లో ఉన్నారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగానే ఉంది. ఇప్పటి వరకూ అక్కడ టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే పోటీ ఉంది. మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీని రెండు పార్టీలు పట్టించుకునే వారు కారు. కానీ ఇప్పుడు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రావడంతో తమ ఆలోచనలను మార్చుకున్నారు. కాంగ్రెస్ కు చిన్న పాటి అవకాశం కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇవ్వకూడదన్న ఉద్దేశ్యంతో పని మొదలుపెట్టారు.రెండు పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ నేతలపైనే కన్నేశాయి. కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకునేందుకు అధికార టీఆర్ఎస్ సిద్దంగా ఉంది. బలమైన నేత అయితే వారికి పదవులు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఒంటరిని చేయాలన్నది టీఆర్ఎస్ ఆలోచన. అందుకే హుజూర్ నగర్ లో మండల స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతలకు టీఆర్ఎస్ వల వేస్తుందంటున్నారు. కొందరు ఇప్పటికే సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి రాకముందే దెబ్బతీయాలన్న యోచనలో టీఆర్ఎస్ ఉంది. ఇక బీజేపీ కూడా హుజూరాబాద్ విషయంలో గెలుపు తమదేనన్న ధీమాలో ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను పార్టీలోకి రప్పించేందుకు ఆపరేషన్ స్టార్టయిదంటున్నారు. రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ కొంచెం బలపడినా అది తమకు ఇబ్బందిగా మారుతుందన్న ఆలోచనలతో దానిని వీక్ చేేసేందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. మొత్తం మీద రేవంత్ రెడ్డి పరిగెత్తక ముందే కాళ్లకు సంకెళ్లు వేయాలన్న టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Related Posts