YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఆకాల వర్షం అపార నష్టం రైతులను ముంచేసిన గాలి వాన

ఆకాల వర్షం అపార నష్టం రైతులను ముంచేసిన గాలి వాన

అకాల వర్షాలతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పది రోజుల కింద దఫదఫాలుగా కురిసిన భారీ వర్షాలు, వడగండ్ల వాన, ఈదురు గాలులు రైతులకు కడగండ్లు మిగల్చగా తాజాగా గురువారం కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. పంటలు చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.. వేల క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అటంకం కలిగింది.ఉష్ణోగ్రతలు రాష్ట్రాన్ని ఉడికిస్తున్న వేళ ఊహించని రీతిలో వరుణుడు గాలిని పోగేసుకునిబీభత్సం సృష్టించాడు.. చెట్లు, హోర్డింగ్‌లు కూలి నష్టం సంభవించింది. వరంగల్‌ రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ఫాం రేకులు లేచిపోయి విద్యుత్తు తీగలపై పడటంతో సరఫరా ఆగి రెండుగంటలపాటు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది విద్యుత్తు స్తంభాలు నేలకూలి గంటలపాటు సరఫరాకు విఘాతం ఏర్పడింది. జిల్లాల్లో యాసంగి పంటలను కొనుగోలు చేస్తున్న ఐకేపీ కేంద్రాల్లో చాలా చోట్ల టార్పాలిన్లు లేక ధాన్యం రాశులు తడిసిపోయాయి. ఖమ్మం, మెదక్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, మంచిర్యాల  జిల్లాల్లో కల్లాల్లో ఉన్న మొక్కజొన్న, మిరప పంటలు తడిసిపోయాయి. పలు జిల్లాల్లో మామిడితోటలకు నష్టం వాటిళ్లింది.అకాల వర్షం వలన ఓరుగల్లు అతలాకుతలమైం ది. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం కురువడంతో జనం ఆందోళనకు గురయ్యారు. ఈ ఆకా ల వర్షం వల్ల జిల్లాలో వరి, మక్కజొన్న, మామిడి రైతులకు తీవ్ర అపార నష్టం వాటిల్లింది. ఈ అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చేయూత అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఈదు రు గాలులతో కూడిన వర్షంతో జిల్లాలోని అనేక ప్రాంతాలలో కరెంట్ స్థంభాలు కూలిపోయి చెట్లు విరిగి పడ్డ నగరంలోని విద్యుత్తుకు అంతరాయం కలిగింది. ఎంజీఎం సెంటర్‌లోని చిరువ్యాపారుల దుకాణాలు చిందరవందరగా అయ్యాయిజనగామ మార్కెట్ యార్డులో రాసులు పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పంట విక్రయించడం కోసం ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర వస్తుందని రైతులు మార్కెట్‌కు వస్తే ధాన్యం మాచరింగ్ కోసం రెండు మూడు రోజులు ఆరబోసి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆశాభావంతో ఉన్న రైతులకు అకాల వర్షం నిరాశపరిచిందని వాపోయారు.ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతాంగాన్ని నిండి ముంచింది. వర్షంతో కూడిన జల్లులు ప్రారంభమై పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఖమ్మం, ఏన్కూరు, జూలూరుపాడు, భద్రాచలం, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ అకాల వర్షం రైతాంగాన్ని కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది. మామిడి, మొక్కజొన్న, ధాన్యం రైతులు అకాల వర్షంతో తీవ్రం గా నష్టపోయారు. అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చిన వ్యవసాయోత్పత్తులు పూర్తిగా తడిసిపోయాయి. జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతు లు పెద్ద మొత్తంలో ధాన్యం, మొక్కజొన్న తీసుకొచ్చారు. అధికారుల నిర్లక్షంతో రోజుల తరబడి రైతాంగం వేచి ఉన్న కాంటాలు కాకపోవడం, వ్యవసాయోత్పత్తులను తరలించకపోవడంతో సెంటర్లలోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయోత్పత్తులు తడిసి ముద్దాయి. కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం వస్తే వ్యవసాయోత్పత్తులు తడిసి పోకుండా కాపాడేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో రైతుకు ఈ అకాల వర్షం శాపంగా మారింది.నల్లగొండ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి ఐకెపి కేంద్రాల్లో మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అకాల వర్షంతో రైతులు అగచాట్లు పడ్డారు. జన జీవనం పూర్తిగా స్థంబించింది. వందలాది ఎకరాల్లో మామిడి తోటకు భారీగా నష్టం వాటిల్లింది.మంచిర్యాల, కుమ్రంబీమ్ ఆసిఫాబాద్ జిల్లాలను కుదిపివేసింది. మంచిర్యాల నుంచి వాంకిడి వరకు రాష్టీయ రహదారిపై పలు చోట్ల చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిచి పోవడంతో రైతులు ఆందోళన చెందుతుండగా అధికారులు ధాన్యాన్ని పరిశీలించారు. మందమర్రి,బెల్లంపల్లి,తాండూర్, జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని మామిడి తోటలు మరోసారి దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల వర్షం వలన నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆధుకోవాలని కోరుతున్నారు.

Related Posts