నల్లగొండ
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధి తిప్పర్తి రోడ్డులో దళితులకు సంబంధించిన స్మశాన వాటిక ధ్వంసం వివాదంగా మారింది. కొన్నేళ్లుగా నకిరేకల్ తిప్పర్తి రోడ్డులో దళితుల స్మశానవాటికగా ఉన్న ప్రాంతాన్ని మున్సిపల్ చైర్మన్ ఆదేశాలతో కొందరు కాంట్రాక్టర్లు జెసిబి, ట్రాక్టర్లతో ధ్వంసం చేయడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మశానం కూల్చివేతకు కారణమైన మున్సిపల్ చైర్మన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయీ. దళితులకు చెందిన స్మశాన వాటికను కక్షపూరితంగా మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ కూల్చివేతకు సిద్ధమవుతున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎలాంటి నోటీసు లేకుండా స్మశాన వాటికను కూల్చివేతపై దళితుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మశాన వాటికను ఆక్రమించుకోవడానికి మున్సిపల్ చైర్ పర్సన్ రాచకొండ శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి ఈదారుణానికి పాల్పడ్డారని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. వెంటనే స్మశాన వాటిక కూల్చివేతను ఆపకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతోందని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు. దీనిపై స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య స్పందించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.