చిత్తూరు
మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయిన చిత్తూరులో టూ వీలర్ బైక్ ముఠాను పోలీసులు ఆరెస్టు చేసారుఏ. సుమారు రూ. 1 కోటి విలువైన 107 ద్విచక్ర వాహనాలు, 1 ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదు అయిన ద్విచక్ర వాహనాల దొంగతనాలను చేధించడానికి ఎస్. పి. ఎస్. సెంథిల్ కుమార్. చిత్తూరు జిల్లా లోని నాలుగు సబ్ డివిజన్ అధికారుల నేతృత్వంలోని ఓ బృందాన్ని ఏర్పాటు చేసారు. ఈ బృందం దర్యాప్తు లో భాగంగా జిల్లా వ్యాప్తంగా నమోదు అయిన ద్విచక్ర వాహనాల దొంగతనాలను చేధించింది. వాహనాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అమ్మే 11 మంది దొంగలను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి 107 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ద్విచక్ర వాహనాలను ఇంటి అరు బయట పార్కింగ్ చేసి ఉన్నప్పుడు, షాపింగ్ మాల్స్ వద్ద, దుఖానాల వద్ద పార్క్ చేసి ఉన్న వాహనాలను దొంగిలించి, ఆ వాహనాలను తక్కువ ధరకు అమ్మేవారు. వీరు చెడు వ్యసనాలకు బానిసై, సులభంగా డబ్బులు సంపాదించాలని కోరికతో ద్విచక్ర వాహనాల దొంగతనం చేసేవారని సెంథిల్ కుమార్ చెప్పారు.