YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అప్పుల్లో జీహెచ్ఎంసీ

అప్పుల్లో జీహెచ్ఎంసీ

అప్పుల్లో జీహెచ్ఎంసీ
హైదరాబాద్
హైదరాబాద్ నగర పాలక సంస్థకు అప్పుల తిప్పలు వున్నాయని టీడీపీ నేత  కాట్రగడ్డ ప్రసున అన్నారు. అప్పుల ఊబిలో జీహెచ్ఎంసీ మునిగిపోయిందని ఆమె అన్నారు. చంద్రబాబు  హయాంలో అద్భుతంగా ఉండేది కానీ టిఆర్ఎస్ వచ్చాక అప్పుల ఊబిలో ఉంది. రోజు రూ.కోటి రూపాయలు వడ్డీలు కడుతుంది. ఫిక్స్ డ్  డిపాజిట్ కింద రూ. 800 ఉండేది. ఇప్పుడు అంత స్వాహా చేశారు. జీహచ్ఎంసీ కి కి కేంద్ర ,  రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల భవనాల ద్వారా కోట్లల్లో బకాయిలు ఉన్నాయి. అప్పుల పాలు చేస్తే విశ్వనగరంగా ఎలా అవుతుంది. నగరంలో ఉన్న ఉమ్మడి ఆస్తులను జగన్ అమ్ముతుంటే తెలంగాణసర్కారు ఏం చేస్తుంది. 60 శాతం ఆదాయం ఇస్తున్న హైదరాబాద్ పాలక సంస్థను నిర్వీర్యం చేస్తున్నారు. పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చునట్టు కనపడుతుంది. వర్షం వస్తే ఇండ్లు మునుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది హైదరాబాద్ పరిస్థితినే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.

Related Posts