YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి: ఎర్రబెల్లి

ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి: ఎర్రబెల్లి

ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి: ఎర్రబెల్లి
హన్మకొండ ఆగష్టు 3
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉపాధి హామీ పథకం ఉద్యోగులందరికి 30 శాతం జీతాలు పెంచినందుకు ఉపాధి హామీ ఉద్యోగులు రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హన్మకొండ లోని రోడ్లు, భవనాల శాఖ అతిధి గృహంలో మంగళవారం నాడు కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ ఉద్యోగులు పాటుపడటం అభినందనీయమైన విషయమని అయన అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఖజానా పై భారం పడుతున్నప్పటికీ ఉద్యోగుల జీతం 30 శాతం పెంచడం జరిగిందని తెలిపారు. ఉపాధిహామీ ఉద్యోగులు ఉపాధిహామీ పథకం అమలుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అయన తెలిపారు. ఇదే స్పూర్తితో మరింతగా ఉద్యోగులు కృషి చేయాలని అయన కోరారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కారిస్తామని అయన తెలిపారు.ఉపాధిహామీ పథకం అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. మోహన్ రావు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులు లింగయ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి విజయకుమార్,టెక్నీకల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి,అటెండర్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతం, పలువురు ఉపాధి హామీ ఉద్యోగులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సన్మానించారు.

Related Posts