YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాడగడ కుమ్మరి  పిల్లలకు క్షణమే ప్రభుత్వ పాఠశాలలో సీట్లు కల్పించాలి.  

మాడగడ కుమ్మరి  పిల్లలకు క్షణమే ప్రభుత్వ పాఠశాలలో సీట్లు కల్పించాలి.  

మాడగడ కుమ్మరి  పిల్లలకు క్షణమే ప్రభుత్వ పాఠశాలలో సీట్లు కల్పించాలి.                    
విశాఖపట్నం
అరకు వేలి మండలం మాడగడ పంచాయతీ మాడ గ్రామానికి చెందిన కుమ్మరి పిల్లలు పై చదువులు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలల్లో లో అడ్మిషన్  లేక ప్రవేటు పాఠశాలలో విద్యని అభ్యసించడానికి ఆర్థిక స్తోమత లేక తరతరాలుగా నష్టపోతూ వీధి బాలలుగా మారుతున్నారు, ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి మాడగడ గ్రామానికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఆరవ తరగతి లో అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి తల్లిదండ్రులు పాఠశాలల్లో వెళ్లి ప్రాధేయ పడుతున్నారు అయినప్పటికీ సీట్లు దొరకక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. తల్లిదండ్రులు గిరిజన సంఘం సిపిఎం పార్టీ నాయకులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాడగడ కుమ్మరి వీధిలో తల్లిదండ్రులు విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న గిరిజన సంఘం మండల కార్యదర్శి సాంగి రామన్న,సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామా రావు తల్లిదండ్రులు విద్యార్థులతో మాట్లాడుతూ తరతరాలుగా విద్య పొందకుండా సమాజంలో వెనుకబడి ఉన్న మీకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉచితంగా విద్య పొందలేకపోతున్నారు విద్య వైద్యం వ్యాపారం కాకుండా వెనుకబడిన వర్గానికి ఉచితంగా విద్య అందించాలని చట్టాలు ఉన్నప్పటికీ విద్య అందని ద్రాక్షగా మారింది ఇప్పటికైనా సంబంధిత విద్యా శాఖ వారు ఈ ఏడాది ఆరవ తరగతి లో అడ్మిషన్ కొరకు అవకాశం కల్పించాలని  డిమాండ్ చేశారు  ఈ సందర్భంలో లో కృపా, మత్య రాజు తూమ్ నాద్, గోపి తదితరులు ఉన్నారు.

Related Posts