YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. రేపటికి కోర్టు వాయిదా

దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. రేపటికి కోర్టు వాయిదా

దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. రేపటికి కోర్టు వాయిదా
అమరావతి ఆగష్టు 3
మాజీ మంత్రి దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉత్తర్వుల కోసం  హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఉమ తరపున పోసాని వెంకటేశ్వర్లు, ప్రభుత్వం తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎటువంటి గాయాలు లేవని, హత్యాయత్నం సెక్షన్లు వర్తించవని ఉమ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.  ఫిర్యాదు ఇచ్చిన వారు వసంత్ కృష్ణప్రసాద్ సన్నిహత సహచరుడు పాలడుగు దుర్గాప్రసాద్ డ్రైవర్ అని డిఫెన్స్ న్యాయవాది పేర్కొన్నాడు. డ్రైవర్ కులం తెలిసే అవకాశం ఉమకు లేదని న్యాయవాది చెప్పాడు. రాజకీయ కక్షతోనే ఆయన్ను కేసులో ఇరికించారని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ కేసులో పెట్టిన మిగతా నిందితులపై ఎటువంటి ఆరోపణలు లేవని పోసాని పేర్కొన్నారు. కేసు విచారణ జరుగుతుందని, మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని, ఈ దశలో బెయిల్ ఇవ్వడం మంచిది కాదని  ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా మచిలీపట్నం కోర్టులో వేశారని న్యాయవాది  తెలిపారు. ఇరు పక్షాల విన్న అనంతరం ఉత్తర్వుల కోసం రేపటికి కోర్టు వాయిదా వేసింది.

Related Posts