YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

 సివిల్ జడ్జిగా సింగరేణి కార్మికుని కుమార్తె ఎంపిక - ఘనంగా సత్కరించిన జడ్పిటిసి   కందుల సంధ్యారాణి    

 సివిల్ జడ్జిగా సింగరేణి కార్మికుని కుమార్తె ఎంపిక - ఘనంగా సత్కరించిన జడ్పిటిసి   కందుల సంధ్యారాణి    

 సివిల్ జడ్జిగా సింగరేణి కార్మికుని కుమార్తె ఎంపిక
- ఘనంగా సత్కరించిన జడ్పిటిసి   కందుల సంధ్యారాణి    
పెద్దపల్లి  ఆగస్ట్ 03
సింగరేణి కార్మికుడిగా ఆ తండ్రి పడుతున్న కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసి, తాను ఉన్నత చదువులు చదివి మంచి కొలువు సాధించి తండ్రి కష్టానికి బహుమతిగా అందించాలన్న ఆ బిడ్డ సంకల్పానికి విజయం చేకూరింది. సింగరేణిలో మరో విద్యా కుసుమం వెల్లి విరిసి, ఈ ప్రాంత యువతకు ఆదర్శంగా నిలవడం యావత్ సింగరేణికే గర్వకారణమని పాలకుర్తి జెడ్పిటిసి సభ్యురాలు కందుల సంధ్యారాణి అన్నారు. గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు రామ్మోహన్, అరుణ దంపతుల కుమార్తె శృతి తొలి ప్రయత్నంలోనే సివిల్ జడ్జిగా విజయాన్ని సాధించడం ఈ ప్రాంత యువతకు ఆదర్శం అని సంధ్యారాణి కొనియాడారు.  శృతి ఇంటికి చేరుకుని ఆమెను అభినందించారు.
నేటి యువతరం అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి ఫలితాలను సాధించాలని సంధ్యారాణి ఆకాంక్షించారు. పోటీ ప్రపంచంలో శృతి సాధించిన విజయాన్ని ప్రతి ఒక్కరూ
ఆదర్శంగా తీసుకుని వారు కూడా మంచి కొలువులు సాధించాలి అని పిలుపు నిచ్చారు. శృతి విజయం సింగరేణి కార్మిక లోకంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు గర్వ కారణమని ఆమె అన్నారు. పేదలకు న్యాయపరమైన సేవలు అందించడంలో ఎల్లప్పుడూ తగిన చొరవ చూపుతూ మహిళాలోకానికి అండగా నిలవాలని శృతిని సంధ్యారాణి అభినందించారు. అనంతరం శృతికి పూలదండ వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఆమె తల్లి దండ్రులు రామ్మోహన్, అరుణ దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బత్తుల పోచం, పైడిపెల్లి అశోక్, కందుల పోచం, గుండు రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts