YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదు నాడు చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రో ధరలు భగ్గు

 ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదు నాడు చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రో ధరలు భగ్గు

 ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదు
నాడు చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రో ధరలు భగ్గు
తాడేపల్లి
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి  మీడియాతో మాట్లాడారు.  ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదు. నాడు చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రో ధరలు భగ్గుమన్నాయని అయన అన్నారు. రెండేళ్లలో నాలుగుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు.ఆనాడు కోవిడ్ లేదు. ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంది. అయినా చంద్రబాబు పెట్రోల్పై అదనంగా భారం వేశారు.ఇప్పుడు సిగ్గు ఎగ్గూ లేకుండా ఆందోళన చేస్తామంటున్నారని అయన అన్నారు.
పని లేని అయ్యవారు:
‘పనీ పాట లేని అయ్యవారు ఏం చేస్తున్నారు అంటే, ఒలకబోసి ఎత్తుకుంటున్నారు అనేది సామెత. చంద్రబాబునాయుడు గారికి, ఆయన పార్టీకి ఇది వర్తిస్తుంది. నిన్న ఆ పార్టీ కొన్ని తీర్మానాలు చేసింది. అందులో ఒకటి ఈనెల 7న పెట్రో ధరల మీద ధర్నా చేయాలన్న నిర్ణయం. అయితే వారి ఆందోళన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కోవిడ్ సాకు చూపి కొద్ది మంది మాత్రమే రావడం, ఫోటోలు తీసుకోవడం, తమకు సంబంధించిన పత్రికల్లో వేసుకోవడం, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించడం. ఇవన్నీ ప్రజలకు తెలుసు’.
ఆ హక్కు మీకు లేదు:
‘పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ జగన్ గారి ప్రభుత్వం పెంచలేదు. అవి పెంచింది సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వమే. అంతే కాకుండా ఆ కారణం చూపి ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచిన పెద్దమనిషి, ఇవాళ పెట్రో ధరలకు నిరసన వ్యక్తం చేస్తామని చెబుతున్నారు.
ప్రభుత్వంపై విమర్శించే హక్కు మీకు లేదు. మీరు సంజాయిషీ ఇవ్వాలి. ఊహించని విపత్తుతో ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎంతో జాగ్రత్తగా అన్నింటిని చక్కదిద్దుతూ వస్తున్నారు సీఎం శ్రీ వైయస్ జగన్ గారు’.
లీటరు పెట్రోల్పై రూ.4 వడ్డన:
‘2015 ఫిబ్రవరిలో పెట్రోల్, డీజిల్ మీద ఉన్న వ్యాట్కు అదనంగా లీటరుకు రూ.4 చొప్పున అదనపు పన్ను వేసింది చంద్రబాబు ప్రభుత్వమే. ఆ మేరకు ఆరోజు జీఓ కూడా జారీ చేశారు. అలా ఎందుకు పెంచారన్న దానికి కారణం కూడా చూపలేదు. ఆరోజు రూ.4 ఎందుకు అదనంగా పెంచారని అందరూ అడిగినా, ప్రభుత్వం స్పందించలేదు. ప్రజలు నిలదీసినా సమాధానం లేదు. ఆరోజు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి పట్టించుకోలేదు’.
అప్పట్లో ధరలు ఇలా పెరిగాయి:
‘2014 జూన్లో రూ.73 ఉన్న పెట్రోల్ ధర ఏపీలో 2018 సెప్టెంబరు నాటికే రూ.86 దాటింది. డీజిల్ అయితే రూ.62 నుంచి రూ.80 కి పెరిగింది. ఇదంతా 2018 సెప్టెంబరు నాటికే జరిగింది. ఆ తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను ఎక్కడా తగ్గించింది లేదు. ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2019, ఏప్రిల్ నాటికి ఆంధ్రప్రదేశ్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.87.24 కు చేరింది. ఆ విధంగా దాదాపు రూ.100 కు చేరువయ్యారు’.
వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాం:
‘ఇక వైయస్సార్సీపీ ప్రభుత్వ హయానికి వస్తే, కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.30 వేల కోట్ల రెవెన్యూ తగ్గింది. కోవిడ్ సమయంలో నిరుపేదలను ఆదుకోవడం కోసం, అదనంగా రూ.30 వేల కోట్లు ఖర్చయ్యాయి. అంటే ప్రభుత్వంపై దాదాపు రూ.60 వేల కోట్ల భారం పడింది. అయినా రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు ఎక్కడా పన్నులు పెంచలేదు. పెట్రోల్ మీద అధిక భారం వేయలేదు’.
ఆ ఒక్క రూపాయి కూడా
ఈ మధ్య కాలంలో లీటరు పెట్రోల్ మీద కేవలం ఒక్క రూపాయి పెంచిన విషయం అందరికీ తెలిసిందే. అది కూడా ఎందుకు వేశామన్నది చెప్పాలి. చందబాబు అయిదేళ్ల హయాంలో రాష్ట్రంలో రహదారులను పట్టించుకున్న పాపాన పోలేదు. అవి గుంతలు పడ్డా, గోతులు పడ్డా ఏరోజూ ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి నోరెత్తలేదు. గత రెండేళ్లుగా భారీగా వర్షాలు పడ్డాయి. దాంతో రోడ్లు మరింత దెబ్బ తిన్నాయి. ఆ రోడ్లను ఈ అక్టోబరు నుంచి మరమ్మతు చేయబోతున్నారు. ఆ ఆర్థిక వనరుల కోసమే ఆ నిర్ణయం. నిజం చెప్పాలంటే పెట్రో ధరల సాకు చూపి ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచలేదని అయన అన్నారు.  
నాడు సింగారం. నేడు వికారం:
‘అయినా సిగ్గు ఎగ్గూ లేకుండా ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తామంటున్నారు. మీకు రెండు పత్రికలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, ఏం చేసినా ప్రజలు పట్టించుకోరని అనుకుంటున్నారా. వర్షాల సమయంలో రోడ్లు బాగు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి అక్టోబరు నుంచి మరమ్మతులు జరుగుతాయి. దాని కోసమే ఏపీఆర్డీసీ గట్టిగా ప్రయత్నం చేస్తోంది. బాబు హయాంలో రోడ్లు బాగోకపోయినా మీకు అవి అందంగా కనిపించేవి. సింగారంగా కనిపించేవి. మీకు నచ్చని ముఖ్యమంత్రి ఉంటే అవే రోడ్లు మీకు వికారంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆరోజు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. ఇవాళ ఆయన అధికారంలో లేడు. ఎలాగైనా ఆయనను అధికారంలోకి తేవాలన్నది ఆ మీడియా ఆరాటం’.
చంద్రబాబు నిర్వాకమే:
‘చంద్రబాబు చేసిన అరాచకాలు, అన్యాయాలు, అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకోవడం వల్ల, మరోవైపు ఆ తర్వాత కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారడంతో, అనివార్యంగానే కేవలం ఒక్క రూపాయి వసూలు చేయాలని నిర్ణయం. మీకు ధైర్యం ఉంటే పెట్రో ధరలు ఎందుకు పెంచుతున్నారని కేంద్రాన్ని నిలదీయండి. ఆ పని చేయకుండా, ఇప్పుడు సిగ్గు లేకుండా మీరు చేస్తున్న ఆందోళనను ప్రజలు గమనిస్తున్నారన్న  విషయం గుర్తుంచుకోండి’.
ఆ కంపెనీ తరలి పోవాలి:
‘ఇక మరో విషయం.. అమరారాజా బ్యాటరీ కంపెనీ తరలి పోతుందని ఏబీఎన్ రాధాకృష్ణ కలత చెందుతూ, ఇవాళ్టి పేపర్లో కధనాలు రాశాడు. ఆ కంపెనీ అక్కడి నుంచి తరలిపోవాలని ప్రభుత్వం కూడా కోరుతోంది. ఎందుకంటే, అమరరాజా బ్యాటరీస్ అనే సంస్థ బ్యాటరీలు తయారు చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వారు తయారు చేస్తున్నది కాలుష్యాన్ని. దానిపై 2021 జూలై 12న హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఆ ఫ్యాక్టరీ వదిలే కాలుష్యాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, సమీపంలోని చెరువులు, భూగర్భ జలాలన్నీ దారుణ కాలుష్యానికి గురవుతున్నాయని హైకోర్టు పేర్కొంది’.
ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు:
‘అక్కడి ఉద్యోగుల బ్లడ్ శాంపిల్స్ పరీక్షించగా భారీ స్థాయిలో విషతుల్యమైన పదార్ధాలు లెడ్ రూపంలో అంటే సీసం రూపం కనిపించింది. అంటే బ్యాటరీలు తయారు చేసే క్రమంలో ఉపయోగించే లెడ్ వారి రక్తంలో కలిసిన విషయాన్ని హైకోర్టు తీర్పులో ప్రస్తావించారు. 8 మంది కార్మికుల్లో లెడ్ లెవెల్స్ పరీక్షించగా, వారందరూ కూడా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్లైన్స్ను మించి భారీ స్థాయిలో లెడ్ బారిన పడ్డారని తేలింది. ఆ ఎనిమిది మంది ఇక ఆ ఫ్యాక్టరీలో పని చేయడానికి వీలు లేదని, వారికి వేరే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించాలని హైకోర్టు నిర్దేశించింది’.
‘ఇంకా 55 మంది ఉద్యోగులను పరీక్షిస్తే వారిలో 41 మంది రక్తంలో అనుమతించిన 10 ఎంసీజే స్థాయి కంటే ఎక్కువ లెడ్ నమోదైంది. వీరిని కూడా లెడ్ లేని, లెడ్తో సంబంధం లేని ఇతర ఉద్యోగాలకు మార్చాలన్న హైకోర్టు, వారందరికీ మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవరసరమని పేర్కొంది.
ఇవన్నీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల నేతృత్వంలో మాత్రమే జరగాలని కోర్టు పేర్కొంది’.
అయినా వెనకేసుకొస్తున్నారు:
‘ఇంత స్పష్టంగా హైకోర్టు దీన్ని ఒక విష రసాయనాల పరిశ్రమ, మనుషులను చంపేసే పరిశ్రమ, కార్మికులను చంపేస్తున్న పరిశ్రమగానూ, చివరకు చుట్టుపక్కల గ్రామాలు, అక్కడి నీరు, గాలి అన్నీ విషతుల్యం చేసేస్తున్న పరిశ్రమ అని తీర్పునిస్తే... సిగ్గు లేని రాధాకృష్ణ, చంద్రబాబు వీరిద్దరూ కలిసి అమరరాజా బ్యాటరీస్ను సమర్థిస్తున్నారంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తుంది. అసలు వారిది జర్నలిజమేనా?’.
పరిశ్రమలు రావాలి. అయితే..:
‘పరిశ్రమలు రావాలి. అయితే అవి ప్రజలకు హాని చేయొద్దు. పర్యావరణానికి కూడా హానికరంగా ఉండకూడదు.. ఇది సీఎం శ్రీ వైయస్ జగన్ సంకల్పం. అందుకే గతంలో తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఒక పరిశ్రమను వ్యతిరేకించారు. హైదరాబాద్లో గతంలో సిరిస్ కంపెనీని మూసివేశారు. ఇది ఏదోఅమరరాజా బ్యాటరీ కంపెనీ మీద కోపం కాదు. ప్రజల మేలు కోసమే కంపెనీ పోవాలని ప్రభుత్వం భావిస్తోందని అయన అన్నారు.
ఆర్థిక ఇబ్బందులు వాస్తవం:
‘ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇది దాచి పెట్టే అంశం కాదు. వాస్తవంగా మేము అధికారంలోకి వచ్చే నాటికే మూడు లక్షల కోట్లకు పైగా అప్పు వదిలిపెట్టి పోయారు. ఆ తర్వాత కోవిడ్ వచ్చి, అన్నింటినీ తలకిందులు చేసింది. అదాయం దారుణంగా పడిపోయినా, ప్రభుత్వం ఎక్కడా ఒక్క సంక్షేమ పథకం, కార్యక్రమం ఆపలేదు. కోవిడ్ వల్ల దాదాపు రూ.30 వేల కోట్ల ఆదాయం తగ్గడం, మరోవైపు ఆ సమయంలో నిరుపేదలను ఆదుకోవడం కోసం అదనంగా మరో రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావడం, ఆ విధంగా మొత్తం రూ.60 వేల కోట్లు భారం, మరోవైపు వ్యవస్థ కుదేలు కావడంతో పడిన భారం.. ఇవన్నీ కలిపి దాదాపు లక్ష కోట్లు ప్రభుత్వంపై భారంగా పడ్డాయి’.
వారివి దివాళాకోరు రాజకీయాలు:
‘మనది పెద్ద రాష్ట్రం. ఖర్చు ఎక్కువ. అందుకే అప్పులు చేయాల్సి వస్తోంది. నిజానికి కేంద్రం కూడా అప్పులు చేస్తోంది. కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకోకూడదా? వారికి ఈ రెండేళ్లలో లక్ష కోట్లు నగదు బదిలీ చేశాం. అవి చేయకుండా ఉంటే, ఆ మొత్తం ఉండేది కదా?
కోవిడ్ సమయంలో కేంద్రం కూడా పలు రకాలుగా ప్రజలను ఆదుకుంటోంది కదా? ఇంకా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. ఉచితంగా రేషన్ ఇచ్చారు. మరి బిజేపీ నాయకులు కేంద్రాన్ని కూడా తప్పు పడతారా. రాష్ట్ర బీజేపీ నాయకులది దివాళాకోరు రాజకీయాలు’.. అంటూ   సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ముగించారు.
 

Related Posts