YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

250  యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు సమర్పించాలి

250  యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు సమర్పించాలి

250  యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు సమర్పించాలి
 జిల్లా కలెక్టర్  జి.రవి
జగిత్యాల , ఆగస్టు 03
రాష్ట్ర ప్రభుత్వం సెలూన్, లాండ్రీ షాపు, దోభీ ఘాట్ లకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కోసం అభ్యర్థులు  దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ జి.రవి  మంగళవారం ఒక ప్రకటనలో  తెలిపారు.   జిల్లాలో  సెలూన్ షాపులు , దోబిఘాట్ లు కలిగిన  రజక, నాయిబ్రహ్మణ కులస్తులు   ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని  అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.అభ్యర్థులు తమ దరఖాస్తులను   https://tsobmms.cgg.gov.in  వెబ్ సైట్ లో   దుకాణం ఫోటో,  లైసెన్స్  లేదా లేబర్ లైసెన్స్   జతపర్చాలని,   కిరాయి దుకాణాల  వారు రెంటల్  లీజు డాక్యుమెంట్  జత పర్చి దరఖాస్తు చేయాలని   కలెక్టర్  తెలిపారు.  అభ్యర్థులు తమ దరఖాస్తుల ప్రతులను  జిల్లా బిసి అభివృద్ది అధికారి  కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు.    రజకులు, నాయిబ్రహ్మణలు ఏర్పాటు చేసుకున్న  దోభిఘాట్ లు,  సెలున్ షాపులకు  ప్రభుత్వం ఏప్రిల్ 1,2021  నుంచి 250  యూనిట్ల విద్యుత్  ఉచితంగా ప్రతి మాసం అందిస్తుందని తెలిపారు.

Related Posts