YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఈ పాస్ తో అక్రమాలు నిలిచాయ్ గోదాములలో సీసీ కెమోరాలు

 ఈ పాస్ తో  అక్రమాలు నిలిచాయ్ గోదాములలో సీసీ కెమోరాలు

ఈ-పాస్ తో అక్రమాల అడ్డుకట్ట పడింది. మూడు నెలల కాలంలో 19,110 క్వింటాళ్ల బియ్యం ఆదా అయ్యాయి. ఈ-పాస్ విధానంతో బియ్యం పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడగా, ఏప్రిల్లో అమల్లోకి వచ్చిన రేషన్ పోర్టబిలిటీ లబ్ధిదారులకు సౌకర్యంగా మారింది. ఈ సదుపాయాన్ని జిల్లావ్యాప్తంగా 12,820 మంది వినియోగించుకున్నారు. ఇకపై ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే వారి సంఖ్య పెరిగేలా కనిపిస్తున్నది. అలాగే.. రేషన్ బియ్యంపై నిఘా తీవ్రతరం చేసేందుకు ఎంఎల్‌ఎస్ పాయింట్‌లలో ప్రభుత్వం సీసీ కెమెరాలను నెలకొల్పింది.గోదాములకు బియ్యం రాకపోకలు, నిల్వలపై పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించింది. జిల్లాలో ప్రస్తుతం మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేట్, కోటపల్లి, చెన్నూర్, తాండూర్‌లో ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఇ క్కడున్న గోదాముల నుంచి జిల్లావ్యాప్తంగా బియ్యం రవాణా అవుతున్నాయి. అందరి కదలికలను గమని స్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు అధికారులు నాలుగు గోదాంల వద్ద 29 కెమెరాలను నెలకొల్పారు. మంచిర్యాల గోదాం వద్ద పది, బెల్లంపల్లిలో ఆరు, తాండూర్‌లో ఆరు, లక్షెట్టిపేట్ గోదాం వద్ద ఏడు కెమెరాలను అమర్చారు. మొత్తం కెమెరాలను కలెక్టరేట్‌లో నెలకొల్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. జిల్లాలోని నాలుగు గోదాముల్లో 29 కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.ఫిబ్రవరిలో 5,030 క్వింటాళ్లు, మార్చిలో 5,160 క్వింటాళ్లు, ఏప్రిల్‌లో 8,920 క్వింటాళ్ల బియ్యం మిగిలాయి. ఏప్రిల్‌లో పోర్టబులిటీ సౌకర్యాన్ని దాదాపు 12,820 మంది వినియోగించుకున్నారు. ఇదిలాఉండగా అధికారులు బియ్యం రాకపోకలు, నిల్వలపై పర్యవేక్షణ కోసం నాలుగు గోదాముల వద్ద 29 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోర్టబిలిటీ కారణంగా ఏప్రిల్ నుంచి బియ్యం కేటాయింపు 20 శాతం పెరగ్గా, సదరు నెలలో 8,920 క్వింటాళ్లు మిగిలా యి. మొత్తానికి ఈ-పాస్ విధానంతో మూడు నెలల వ్యవధిలో 19,110 క్వింటాళ్ల బియ్యం ఆదా అయ్యాయి. పోర్టబులిటీతో ఏప్రిల్ నెలలో 12,820 కార్డుదారులు ఇతర షాపుల్లో బియ్యం తీసుకున్నారు. బెల్లంపల్లిలో 2,192, మంచిర్యాలలో 2,165, నస్పూర్‌లో 2,000 మంది పోర్టబిలిటీని వినియోగించుకున్నారు. జిల్లాలో 423 రేషన్ షాపులు ఉండగా, ఇందులో 416 షాపుల్లోనే పోర్టబిలిటీ సౌకర్యం ఉంది. సాంకేతిక కారణాల వల్ల ఏడు దుకాణాల్లో మొదలు కాలేదు.  

Related Posts