YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఉపఎన్నికల దాకా... నీటి వివాదం

ఉపఎన్నికల దాకా... నీటి వివాదం

అనంతపురం, ఆగస్టు 4, 
రాయలసీమ నీటి వివాదం రానున్న ఎన్నికల వరకూ ఉంటుంది. అది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అవసరం. సెంటిమెంట్ ను ప్రజల్లో ఉండాలంటే ఈ వివాదం ఎన్నికల వరకూ ఏదో రకంగా లైవ్ లో ఉంచాల్సిందే. అందుకే ఎవరి ప్రాజెక్టులు వారు కట్టుకుంటున్నా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇప్పట్లో ఈ వివాానికి తెరపడదు. అయితే ఇది రాయలసీమలోని విపక్ష పార్టీలకు ఇబ్బంది కరంగా మారింది.
రాయలసీమకు నీటిని అందించేందుకు జగన్ కష్టపడుతుంటే కనీసం మద్దతు కూడా ఇవ్వడం లేదన్న ప్రచారం వైసీపీ సోషల్ మీడియా అప్పుడే మొదలు పెట్టింది. రాయలసీమ నీటి వివాదం ఇప్పుడు ఆ ప్రాంత టీడీపీ, బీజేపీ నేతల చావుకొచ్చింది. టీడీపీ అధిష్టానం దీనిపై ఎవరూ మాట్లాడొద్దని హుకుం జారీ చేసింది. దీంతో వారంతా మౌనంగా ఉండాల్సి వస్తుంది. మౌనంగా ఉంటే తమ పట్ల వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన వారిలో నెలకొని ఉంది.ఈ విషయాన్ని కొందరు సీనియర్ నేతలు చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఇది హుజూర్ నగర్, బద్వేలు బై ఎలక్షన్ వరకే ఉంటుందని, కంగారు పడవద్దని వారికి సూచించినట్లు సమాచారం. ఇప్పటికే రాయలసీమకు హైకోర్టును తెస్తామన్న టీడీపీ న్యాయపరంగా అడ్డుకుంటుందన్న భావన ప్రజల్లో ఉంది. అందుకే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడిపత్రి మినహా మరెక్కడా జెండా ఎగురవేయలేకపోయిందిహైకోర్టుతో పాటు ఇప్పుడు కొత్తగా పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో ఏదో ఒక స్టాండ్ తీసుకోకుంటే అసలే అంతంత మాత్రంగా ఉన్న సీమ జిల్లాల్లో టీడీపీ మరింత బలహీనమవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒకరిద్దరు నేతలు ఇలాగే వ్యవహరిస్తే తాము పార్టీని వీడక తప్పదని కూడా అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ పై విమర్శల కన్నా కేసీఆర్ పై చేయడమే మంచిదని పలువురు నేతలు చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. అయినా చంద్రబాబు మాత్రం ఓపికపట్టండి అని చెప్పడంతో సీమ నేతలు ఈ విష‍యంలో గొంతులు నొక్కేసుకున్నారు.

Related Posts