విశాఖపట్నం
మత్స్యకారులు పంట పండింది. అసలే కరోనాతో ఇబ్బం దులు పడుతున్న గంగపుత్రుల వలలకు చిక్కుతున్న మత్స్య సంపదతో లాభా లను అర్జిస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హర్బర్ నుంచి వేటకు వెళ్లిన వారికి కొమ్ము కోణం చేప దొరికింది. సుమారుగా దీని బరువు. 20 కేజీల నుండి 250 కేజీలు ఉండే కొమ్ము కోణం చేప చిక్కింది. 8 అడుగుల నుంచి 15 అడుగుల వరకు ఉండే ఈ చేపను కేరళ రాష్ట్రానికి రవాణా చేస్తున్నట్లు మత్స్యకారులు పోలిశెట్టి తాతాజీ తెలిపారు. ఒక్కవేటలో భారీగా చేపలు చిక్కడంతో మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి అధిక సంఖ్యలో దక్కిన చేపలను రవాణా చేసేందుకు మత్స్యకారులు ఏర్పాట్లు చేస్తున్నారు.దీంతో చాలారోజుల తర్వాత విక్రయాలతో విశాఖ హర్బర్ దర్శనమిచ్చింది.