YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వాసాలమర్రి లో గ్రామస్తుల అందోళన

వాసాలమర్రి లో గ్రామస్తుల అందోళన

యాదాద్రి
ముఖ్యమంత్రి దత్తతగ్రామం వాసాలమర్రి గ్రామంలో అభివృద్ధి కమిటీలతో మీటింగ్ అని అభివృద్ది కమిటీ సభ్యుల వాట్సప్ గ్రూప్ లలో పోస్టింగ్ లు చేశారు, మీటింగ్ ఉన్నదని తెల్లారే సరికి ముస్తాబై గ్రామానికి వస్తే ఇప్పుడు దళిత వాడలో పర్యటన అనంతరం 50దళిత కుటుంభ సభ్యులతో సమావేశం అని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొడవలేదని పెద్దలు ఊరికే అనలేదని గ్రామస్థులు ఇతర కులాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఈ రోజు ఉదయం వరకు గ్రామస్థులతో మీటింగ్ అన్నారు ఇప్పుడు కేవలం దళితులతో మాత్రమే అని ఇతర కులాల వారిని అవమానపరిచినట్లు వ్యవహరిస్తు పోలీసులు అడ్డుకుంటున్నారు దళిత కుటుంబాలు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు, గ్రామంలో కులాలు మతాలు అంటూ చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా అందరూ కలసి మెలిసి అన్నదమ్ముళ్ల వాలే ఉండాలని చెప్పి రెండు నెలలు గడవక ముందే గ్రామంలో కులాల వారిగా మాకు మాకే గొడవలు సృష్టిటిస్తున్న ఈ ముఖ్యమంత్రి మా గ్రామాన్ని దత్తత తీసుకుని మమ్ములను అవాసపాలు చేస్తున్నారని గ్రామస్థులు సీఎం పై మండి పడుతున్నారు..
ఎస్సీ  కాలనీలో మొత్తం 49 గృహాలు ఉన్నాయి అందులో ఇంటికి ముగ్గురు మాత్రమే మీటింగ్ లో పాల్గొనాలని అన్నారు, మొత్తం 150 మంది మించకూడదని ఆదేశాలు ఉన్నాయని అనుకుంటున్నారు గ్రామస్థులు ఇతర కులాలకు అనుమతులు లేవు. బీడీ కార్మికులకు ప్రభుత్వం పింఛన్ ఇవ్వాలని సీఎం ను కలుద్దామని గత మీటింగ్ లో పోతే కలవనివ్వలేదు ఈ రోజు వినతిపత్రం సమర్పించాలని వస్తే ఇప్పుడు కూడా అనుమతులు లేవని అంటున్నారని బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

Related Posts