వాసులు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఉదయం తొమ్మిది అవుతున్నా.. ఇంకా తెల్లారనట్టే కనపడుతున్నాయి అక్కడి వీధులు. పొగమంచు కారణంగా పలు రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు జెండా వందనంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒకపక్కన గణతంత్ర దినోత్సవానికి రెడీ అవుతున్నా.. మరోపక్క పొగమంచుపై టెన్షన్ పడుతున్నారు. దాదాపు అందరూ ఉదయం 8గంటల లోపు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అయితే పొగమంచు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటం వల్ల.. జెండావందనం ఎలా అని ఆలోచిస్తున్నారు. ఢిల్లీకి దగ్గరగా ఉండే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. హిమపాతం అసాధారణంగా ఉంది. ఈ ప్రభావం ఢిల్లీపై కూడా ఉండటంతో అక్కడ మంచు పెద్ద ఎత్తున కురుస్తోంది. దీంతో ఉదయం పూట అక్కడి రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పది అడుగుల దూరంలో ఎవరున్నారనేది కూడా తెలుసుకోలేని పరిస్థితి. దీనివల్ల గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఢిల్లీ వాసులకు కష్టంగానే ఉంది. ఉదయం 10 తర్వాత కానీ జరుపుకోలేమని చెబుతున్నారు.