YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సమ్మర్ ఫుల్ ఛీర్స్

సమ్మర్ ఫుల్ ఛీర్స్

ఎండలు  రాష్ట్ర ఎక్సయిజ్ శాఖకు కాసులు కురిపిస్తున్నాయి.  వేసవి తాపానికి బీర్ విక్రయాలు ఊపందుకున్నాయి. గడిచిన రెండు నెలలతో పోల్చితే 30 శాతం పెరిగాయి. చలి, వర్షా కాలాల్లో లిక్కర్‌కు డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే వేసవిలో దానికి రెట్టింపు స్థాయిలో బీర్‌ల విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. వర్షాకాలం, శీతాకాలంలో అయితే హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలో రోజుకు సుమారు సగటున 8,200కార్టున్‌ల వరకు బీర్ విక్రయాలు జరుగుతాయి. ఒక కార్టున్‌లో 12బీర్ బాటిళ్లు ఉంటాయి. అంటే రోజూ వర్షాకాలం, శీతాకాలాల్లో నగరంలో సగటున 98,400బీర్ బాటిళ్లు అమ్ముడవుతున్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఇక వేసవి కాలానికి వస్తే ఈ విక్రయాలు యాభైశాతానికి పెరుగుతున్నాయి. ముఖ్యంగా మార్చి నుంచి బీర్ విక్రయాలు క్రమంగా పెరుగుతూ మేలో 50 శాతానికి ఊపందుకుంటున్నట్లు బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.  గడచిన నాలుగేళ్ళలో రాష్ట్రంలో బీర్ల అమ్మకం ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో గరిష్ట స్థాయికి చేరింది. ఈ నెలలో రాష్ట్రం మొత్తంమీద 51.76 లక్షల కేసుల బీర్ల వినియోగం జరిగింది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో తలసరి బీర్ వినియోగం సగటున 9.86 కేసుల చొప్పున ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఇదే నెలలో 45.82 లక్షల కేసుల మేర విక్రయం జరిగింది. ఈ సంవత్సరం మార్చి నెలలో 53.86 లక్షల కేసుల వినియోగం జరిగినప్పటికీ ఏప్రిల్‌లో మాత్రం ఐదురోజుల పాటు ఆర్థిక సంవత్సరం ముగింపు లెక్కలు, కొత్త సంవత్సరానికి ఇన్వెంటరీ తయారీ తదితర వివిధ కారణాలతో దుకాణాలను మూసివేయడంతో బీర్ విక్రయం 51.76 లక్షల కేసులకు తగ్గింది. దీనికి తోడు ఏప్రిల్ నెలలో అకాల వర్షాలతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో బీర్ విక్రయాల్లో కూడా ఆ మేరకు ప్రభావం కనిపించింది. ఏప్రిల్‌లో కేవలం 25 రోజుల్లోనే 51.76 లక్షల కేసుల (6.21 కోట్ల సీసాలు) మేరకు విక్రయం జరగడంతో రోజుకు సగటున 24.79 లక్షల సీసాల చొప్పున వినియోగమైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్చిలో 31 రోజులకుగాను మొత్తం 53.06 లక్షల కేసుల (6.43 కోట్ల సీసాలు) విక్రయం జరిగింది. ఏప్రిల్ 30వ తేదీన ఒక్కరోజే మద్యం, బీర్ అమ్మకాల ద్వారా రాష్ట్రానికి రూ. 175 కోట్లు సమకూరినట్లు ఎక్సయిజ్ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కరోజే ఇంత పెద్దమొత్తంలో ఎక్సయిజ్ ఆదాయం రావడం ఇదే తొలిసారి అని, గతంలో రాష్ట్రంలో గరిష్ఠ రికార్డు రూ. 132 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో మొత్తం 53.06 లక్షల కేసుల బీరు విక్రయం జరగ్గా, గతేడాది మార్చిలో 35.75 లక్షల కేసులు మాత్రమే. ఈ సంవత్సరం వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున మే నెలలో సైతం బీర్ల విక్రయాలు 

Related Posts