YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉపాధి హమీ బిల్లుల చెల్లింపుల ఆలస్యం అధికారులపై మండిపడ్డ హైకోర్టు

ఉపాధి హమీ బిల్లుల చెల్లింపుల ఆలస్యం అధికారులపై మండిపడ్డ హైకోర్టు

అమరావతి
ఉపాధి హామీ పథకం బిల్లుపై హైకోర్టులో విచారణ జరిగింది. రూ1794 కోట్లకు గాను రూ413 కోట్లు చెల్లింపులు జరిగాయి. నిధుల చెల్లింపు అలసత్వం పై ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయింది. ఇలా చేస్తే మేము చాలా సీరియస్గా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేవలం రూ 43 కోట్లు మాత్రమే చెల్లించారు అని  డిఫెన్స్ న్యాయవాది చెప్పారు. పూర్తి సమాచారంతో అధికారులు ఎందుకు రావడం లేదని  ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ప్రతిసారి సాకులు చెప్పడం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చెప్పే సాకులు కౌంటర్లో కూడా లేవని ధర్మాసనం పేర్కోంది.ఏపీ ప్రభుత్వం ఇలానే ఉంటే సీరియస్ గా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి బిల్లులో 20 శాతం ఎందుకు కోత విధిస్తున్నారు అని ప్రశ్నించింది. మినహాయించి డబ్బులు ఎక్కడ ఉంచుతున్నారని ప్రశ్నించింది. ఎలాంటి వివరాలు లేకుండా హైకోర్టుకు ఎందుకు వస్తున్నారని నిలదీసింది. అధికారులంతా మళ్లీ వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను ఆగస్టు 18 కు వాయిదా వేసింది. పూర్తి డేటాతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది 

Related Posts