YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్రపంచ వ్యాప్తంగా 600 థియేటర్స్ లలో ఆగస్ట్ 6 న విడుదలవుతున్న "SR క‌ళ్యాణమండపం EST 1975". ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది..

ప్రపంచ వ్యాప్తంగా 600 థియేటర్స్ లలో ఆగస్ట్ 6 న విడుదలవుతున్న "SR క‌ళ్యాణమండపం EST 1975". ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది..

ప్రపంచ వ్యాప్తంగా 600 థియేటర్స్ లలో ఆగస్ట్ 6 న విడుదలవుతున్న "SR క‌ళ్యాణమండపం EST 1975". ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది..

"SR క‌ళ్యాణమండపం EST 1975" చిత్రం టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ అస‌క్తిని క్రియేట్ చేసుకుంది. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఈ సినిమాలో విడుద‌ల చేసిన పాట‌లు,టీజ‌ర్ కి యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తో  టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో SR క‌ళ్యాణమండపం EST 1975 చిత్రం హాట్ టాపిక్ గా మారడం విశేషం. విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో  రాజావారు రాణిగారు’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సివాలా చిత్రంతో ఆకట్టుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నూత‌న దర్శ‌కుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో  ప్ర‌మోద్, రాజు లు నిర్మిస్తున్న చిత్రం  ‘ SR కళ్యాణమండపం – Est. 1975 ‘ .  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు,శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు. ఆగస్ట్ 6 న ప్రపంచ వ్యాప్తంగా 600 థియేటర్స్ లలో ఈ చిత్రం విడుదల చేస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు యస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి లు చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలుపగా,  రాజశేఖర్,జీవిత లు , SR కళ్యాణమండపం – Est. 1975 ‘ మొదటి బిగ్ టికెట్ విడుదలచేయగా హీరోలు అల్లరి నరేష్, కార్తికేయ లు  మొదటి టికెట్ ను కొనుగోలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు నక్కిన త్రినాథ్, దర్శకుడు తరుణ్ భాస్కర్, ఫిలిం ఛాంబర్  వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్,హీరో అల్లరి నరేష్, హీరో కార్తికేయ, సాయి సుశాంత్,  అవసరాల శ్రీనివాస్, తేజ సజ్జ తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియ జేశారు. అనంతరం
 ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ దర్శక,నిర్మాతలు యస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి లు మాట్లాడుతూ... ప్రమోద్ గారు ,రాజు గారు కలిపి ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ అను బ్యానర్ పెట్టి చాలా మంచి సినిమాను తీశారు.దర్శకుడు శ్రీధర్ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. ట్రైలర్ చూస్తుంటే  కిరణ్ చాలా బాగా చేశాడు.సాయి కుమార్ గారి నటన గురించి చెప్పనవసరం లేదు ఈ సినిమాలో డీఫ్రెంట్ గా కొత్తగా చేశాడు. దర్శక,నిర్మాతలు, హీరో కిరణ్ లు ముగ్గురు కలసి ఒక సెన్సేషనల్ హిట్ మూవీ తీయాలనే తపన మాత్రం ఈ సినిమాలో కనపడింది. ఈ బ్యానర్ లో మంచి హిట్ తో ముందుముందు ఈ బ్యానర్ లో మంచి మంచి సినిమాలు తీసి పెద్ద బ్యానర్ గా ఎదుగుతుందనే నమ్మకం ఉంది.సంగీత దర్శకుడు మంచి పాటలు ఇచ్చాడు.మంచి సినిమా తీయడం అంటే చాలా కష్టం. అలాంటిది వీరందరూ టీంగా ఏర్పడి మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానాని అన్నారు.
 ఫిలిం ఛాంబర్  వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ... మధ్యతరగతి జీవితాల తండ్రి ఏలా ఉంటాడనేటటువంటి సన్ రిలేషన్స్ కథ ఇది. ఒక తండ్రి తన బిడ్డని ఎలా  చూసుకుంటాడు, ఎక్కడైనా  తప్పు చేస్తాడా  అని ఎంతో కేర్ తీసుకునే తండ్రిగా  సెల్యూలాయిడ్ పై సాయికుమార్ గారు ఇందులో చాలా చక్కగా నటించారు.యూత్ అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. తండ్రి కోడుకులుగా కిరణ్, సాయికుమార్ ల నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమాలో  ప్రేక్షకులకు కవసిన  అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. అలాగే మా శంకర్ పిక్చర్ కు డిస్ట్రిబ్యూటర్స్ లకు మంచి డబ్బులు వచ్చి  మీ అందరి ఆశీస్సులతో మా సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ప్రేక్షకులందరు కూడా థియేటర్ కు వెళ్ళినపుడు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎవరికీ ఇబ్బందులు కలుగ చేయకుండా సహకరిస్తారని తెలుగు ఫిలిం ఛాంబర్  వైస్ ప్రెసిడెంట్ గా మిమ్మల్నందర్నీ వేడుకుంటున్నానని  అన్నారు.
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఈ పాండమిక్ టైంలో సినిమా చేయడం  ఈ సినిమా చేసి విడుదల చేయడానికి విడుదల చేయడం మీ ధైర్యానికి మర్చిపోవచ్చు ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి సక్సెస్ సాధిస్తే మిగిలిన వారంతా మళ్లీ సినిమాలు చేయాలనే ప్రయత్నిస్తారు .పాత రోజులు మళ్ళీ రావాలి అందరూ
ప్రేక్షకులందరూ థియేటర్కు వస్తేనే సినిమాలు విజయం సాధించాయి .థియేటర్ కు రాకపోతే అది కాస్తా కల్యాణమండపాలు అవుతాయి కాబట్టి ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ కి మంచి పేరు రావాలి సెకండ్ టైం చేసిన ఈ సినిమా గొప్ప హిట్ అవ్వాలని కోరుతున్నారు
 అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. దర్శక,నిర్మాతలు, హీరో కలసి మంచి కథను సెలెక్ట్ చేసుకొని చేసిన 'SR కళ్యాణమండపం – Est. 1975 ‘ సినిమాను విడుదల చేస్తున్నారు. కోవిడ్ తరువాత వస్తున్న  ఈ సినిమాను ప్రేక్షకులు ఆధరించి సినిమాను సక్సెస్ చేస్తే  సినిమా ఇండస్ట్రీ కు  బూస్టప్ అవుతుంది. తద్వారా మరిన్ని సినిమాలను థియేటర్స్ లలో విడుదల చేస్తారని అన్నారు.
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. కిరణ్ గురించి చాలా విన్నాను.ఈ సినిమా గురించి కూడా  చాలా విను ఎందుకంటే ఈ సినిమాలో  చుక్కల చిన్ని అన్న పాటను రాజశేఖర్ గారు రోజు వింటుంటారు.అందరూ చెప్పినట్లు థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అవ్వడం చాలా సంతోషంగా ఉంది .అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకొని మన చుట్టూ కోల్డ్ అనే భయంకరమైన సిచువేషన్ లో ఉన్నాము అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా థియేటర్కు వచ్చి ఎస్ ఆర్ కళ్యాణమండపం పెద్ద హిట్ చేసి మా  సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోయాలని పోస్తారని ఆశిస్తూ ఈ చిత్రంలో నటించిన అందరికీ
మరియు సాంకేతిక నిపుణులకు అందరికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు
 హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ....మామూలుగా సినిమా తీయడమే కష్టం అది ఈ కష్టకాలంలో సినిమా చేసి
థియేటర్కు తీసుకురావడం అనేది ఇంకా చాలా కష్టం సో ఇన్ని కష్టాలు పడి ఈ సినిమాను ఈ నెల 6న విడుదల చేస్తున్నారు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరు కుంటున్నాను కిరణ్ గారికి సాయి సాయి గారికి కంగ్రాచులేషన్ ఈ సినిమా కొనుక్కున్న ముత్యాల రామదాసు కి బాగా డబ్బు రావాలి పెద్ద హిట్ అవ్వాలని కోరు కుంటున్నాను ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాజులేషన్ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు
దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.... నా కరెంట్ ఎవరెస్ట్ హీరో కిరణ్ అబ్బవరం ఫేవరెట్ హీరో కిరణ్ అబ్బవరం చాలా మంచి  డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. ఈ పాండమిక్ స్వీచ్ వెషన్ లో కూడా ప్రమోద్,రాజులు  ఈ సినిమా చేయడం చాలా గ్రేట్ ఇకనైనా ఫిల్మ్ ఇండస్ట్రీ కి గత వైభవం వస్తుందని ఆశిస్తున్నాను.ఓటిటి లో సినిమాలు రిలీజ్ అయిన కూడా థియేటర్ లో సినిమాను చూస్తే వచ్చే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది .పాటలు చాలా హిట్ అయ్యాయి.పాటలు లాగే ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి.నేను ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా ఈ సినిమా టీమ్ అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలని కోరుతున్నాం అని అన్నారు
 హీరో కార్తికేయ మాట్లాడుతూ.. రాజశేఖర్ గారిని సాయి కుమార్ గారిని ఇద్దరినీ ఒకేసారి స్టేజ్ పై చూస్తుంటే నాకిది మెగా అచీవ్మెంట్ ల భావిస్తున్నాను. గత 35 సంవత్సరాల నుంచి ప్రేక్షకులను మెప్పిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న సీనియర్స్ ముందు నిల్చోవడం హ్యాపీ గా ఫీల్ అవుతున్నాము. సెకండ్ వేవ్ తర్వాత ఆగస్టు 6న వస్తున్న ఫస్ట్ మూవీ" SR కళ్యాణమండపం – Est. 1975 " . కిరణ్ కి ఈ సినిమా ఎంత అవసరమో మాకు అంతే అవసరం ఎందుకంటే ఈ సినిమా విడుదలైతే అప్పుడే నెక్స్ట్ మాతో సినిమా చేసే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ముందుకు వస్తారు. నాలాంటి చాలామంది యూత్ మా సినిమాలను థియేటర్లో  జనాలు వేసే ఈలలు, కేకలు మధ్యలో మా సినిమాను చూసుకివాలనే కోరిక ఉంటుంది.కోవిడ్ కారణంగా సినిమా ఇండస్ట్రీ కు బాగా ఎఫెక్ట్  అయ్యింది. .ఇలాంటి టైం లో " SR కళ్యాణమండపం – Est. 1975 "  సినిమా తీసి విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది . ఈ మూవీతో నాకున్న పర్సనల్ రిలేషన్ చేతన్ భరద్వాజ్  ఆర్ ఎక్స్ 100 లో 'పిల్లా రా' అనే సాంగ్ ఇచ్చి నాకు ఎంతో హైప్ ఇచ్చారు . తనే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ నా సినిమాలో ఒక సాంగ్ మాత్రమే హిట్ ఇస్తే.. కిరణ్ కు మాత్రం ఈ సినిమాలో అన్ని అద్భుతమైన పాటలు అందించాడు అందుకు నాకు జెలసీ గా ఉంది.  అలాగే కిరణ్ గారే ఈ సినిమా స్టోరీ తనే రాసుకుని డైలాగ్ తనే రాసుకుని చేయడం చాలా గ్రేట్ .చాలామంది నా ఫోటో, కిరణ్ ఫోటోను పెట్టి ట్యాగ్ చేస్తు మా ఇద్దరికీ దగ్గర పోలిక ఉందంటున్నారు. అయితే నేను కిరణ్ ను తమ్ముడు అనుకుంటాను. కిరణ్ కు  సినిమా చిత్ర బృందం అందరికీ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు.
 హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. సంవత్సరం క్రితం కిరణ్ గారు చేసిన సినిమా టీజర్ చూశాను అప్పటినుంచి ఆయన చేస్తున్న ప్రతి సినిమాను నేను ఫాలో అవుతున్నాను. తను చూసుకునే కదా విధానం గాని తను చేసే యాక్టింగ్ గాని పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. కిరణ్ గారికి ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది కమర్షియల్ కామెడీతో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది నిర్మాతలు మంచితనం సెలెక్ట్ చేసుకొని నీటి న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమా తీశారు కొత్త వాళ్లతో చేసిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది . దాని ద్వారా వచ్చిన డబ్బుతో మళ్లీ కొత్త వారితోనే సినిమాలు తీసి నువ్వు టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను కోరుతున్నాను అందరికీ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చైతన్య మ్యూజిక్స్ అద్భుతంగా ఉన్నాయి ప్రేక్షకులందరూ కూడా ఆగస్టు సిస్టర్ స్టేట్స్ కు వచ్చి సినిమా చూడాలని కోరుతున్నాను
డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. . కిరణ్ ఈ సినిమాకు ఒక వరం కిరణ్ నన్ను కలిసినప్పుడు నన్ను కలిసి ఈ కథ చెప్పడం జరిగింది ఇందులో అన్న కొత్తగా చూడాలని నన్ను కొత్తగా చూపిస్తున్నాడు అదేంటి అనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది చాలా మంచి సినిమా చాలా మంచి ప్రయత్నం మంచి మనసులతో తీసిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది ఆగస్టు 6న విడుదల ఆవుతున్న మా సినిమాను అందరూ ఆదరించి  మా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను శంకర్ డిస్ట్రిబ్యూటర్స్ కి రాందాస్ బయ్యా రాందాస్ గారికి కుమార్
రఫీ పెద్ద విజయం సాధించాలని ప్రేక్షకులందరూ కూడా సోషల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ  తగిన జాగ్రత్తలు తీసుకొని  వచ్చి చూసి పెద్ద విజయం సాధించేలా చేయాలని అన్నారు
 చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె మాట్లాడుతూ.. మా మీద, నా కథ మీద నమ్మకంతో నిర్మాతలు ప్రమోద్- రాజు గార్లు నాకు ఈ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు  వారికి నా ధన్యవాదాలు . నాతో పాటు మా టెక్నీషియన్స్ అందరికీ కూడా  ఇది మొదటి సినిమా.. నిర్మాతలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే భయం ఉండేది.అంతా కొత్తవారితో చేస్తున్నందుకు ముందు నాకు కొంచెం భయం వేసింది. అయితే నేను సెలెక్ట్ చేసుకున్న టీమ్ తో చేసిన మొదటి రోజు షూటింగ్ తో నాకు  ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది . అందరూ కూడా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు . మ్యూజిక్ డైరెక్టర్ భరద్వాజ్ గారు మాకు  అద్భుతమైన సాంగ్స్ అందించాడు. ఇందులోని పాటలు  యూట్యూబ్ లో పోటీపడి  మంచివి హిట్స్ సాధించాయి.  నేను కిరణ్  షార్ట్ ఫిలిం నుంచి కెరియర్  మొదలుపెట్టాము. కిరణ్ ఏంతో డెడికేట్ గా వర్క్ చేస్తాడు.కిరణ్ తో సినిమా చేసిన వాళ్లు మళ్ళీ తనతో  సినిమా చేయాలను కుంటారు. అంత బాగా వర్క్ చేస్తాడు. నాకు అవకాశమొస్తే మళ్ళీ కిరణ్ తో సినిమా చేస్తాను. సినిమా విషయానికి వస్తే ఒక కళ్యాణమండపం చుట్టూ జరిగే క‌థ‌తో ఎంతో ఆస‌క్తిగా రూపొందిన ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ఎంతో వినోదాత్మక అంశాలతో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో  ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ హీరో తండ్రి పాత్ర  పోషించారు. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని గొప్పగా చూపించే ప్ర‌య‌త్నం చేయడం జ‌రుగింది.  ఆగస్ట్ 6 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న  మా చిత్రం అందరినీ కచ్చితంగా అలరిస్తుంది. అలాగే మమ్మల్ని బ్లెస్స్ చేయడానికి వచ్చి పెద్దలందరికీ ధన్యవాదాలు అని అన్నారు.
 చిత్ర హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ... మమ్మల్ని బ్లెస్స్ చేయడానికి ఇంతమంది మా ఈవెంట్ కు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది.ఈ ఈవెంట్ లో  అరుపులు,కేకలతో ఇంతమందిని చూస్తుంటే సంతోషంతో నా రోమాలు నిక్కబొడుచు కుంటున్నాయి. గత రెండు గంటలుగా ఈవెంట్ లో ఎంత అల్లరి ఉందో మా సినిమాకు వెళ్లిన వారు కూడా అంతే 2 గంటల 30 నిమిషాలు సినిమా థియేటర్ లో కూడా అదే అల్లరి ఉంటుంది. సినిమా అంత బాగా ఉంటుంది.  సినిమాను చూసిన వారంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా టెక్నీషియన్స్ టీం అంత కూడా ఎంతో  సపోర్ట్ చేశారు. అలాగే  సంగీత దర్శకుడు భరద్వాజ్ RX 100 లో పిల్లా రా  లాంటి సూపర్ హిట్ సాంగ్ ఇచ్చాడు.మాకు అలాంటి హిట్ పాటలు మా సినిమాకు కావాలని కలవడం జరిగింది. మేము అనుకున్న దానికంటే అద్భుతమైన మంచి పాటలు ఇచ్చాడు చుక్కల చున్నీ, చూశారే కళ్ళారా , సిగ్గెందుకు రా మామ ఇవి కాకుండా  ఇంకా సినిమాలో మూడు పాటలు ఉంటాయి అవి ఇంకా చాలా బాగుంటాయి . భాస్కర్ పట్ల గారు ఈ సినిమాకు పెద్ద సపోర్ట్ గా నిలిచారు . రాజావారు రాణి వారు నుండి ఈ సినిమా తరువాత నేను చేస్తున్నా సెబాస్టియన్, సమ్మతమే వరకు సిరంజి సినిమా వారు నాకు సపోర్ట్ గా నిలుస్తు న్నందుకు వారికి నా ధన్యవాదాలు.  మా టీం లో వుండే మేము అందరం కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ 'SR కళ్యాణ మండపం' వరకు మేము ఏది  ప్రిపరేషన్ చేసుకోలేదు.రేపు ఎం చేయాలని అందరం మాట్లాడుకుని నెక్స్ట్ డే పని పూర్తి చేసుకొనే వాళ్ళం. ఒక సెకండ్ సినిమా హీరో అయిన  నన్ను నమ్మి ప్రమోద్ అన్న, రాజన్న లతో ఇంత పెద్ద ప్రి రిలీజ్ ఈవెంట్ చేయడమనేది చాలా గొప్ప విషయం ,నాకు  చాలా సంతోషంగా ఉంది .మా సినిమానుండి విడుదల చేసిన ప్రతి కంటెంట్ కు  ప్రేక్షకులు  అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు వారికి మా ధన్యవాదాలు. మేము ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాము. నిర్మాతలకు మధ్యలో ఓటిటి ఆఫర్ వచ్చినా కూడా మేము తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు థియేటర్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వాలని  ఇప్పటివరకు  వెయిట్ చేశారు. అలాగే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 600 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నారు. గాక ఓరుగల్లు బ్యానర్ పైన యు.యస్ లో  78 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు .ఈ సినిమా చూసిన వాళ్ళు అందరూ కూడా రెండు గంటలు కచ్చితంగా నవ్వుకుంటూ మంచి ఎంజాయ్ చేస్తారు. శంకర్ పిక్చర్స్ శంకర్ గారు నవీన్ గార్లు  ఇలాంటి సిచువేషన్ లో కూడా థియేటర్స్ జనాలు వస్తారా, రారా అనేది ఆలోచించ కుండా కేవలం మా  సినిమా టీజర్ నచ్చింది అని చెప్పి మా సినిమాను తీసుకున్నారు అయితే మా సినిమా మా వల్ల ఒక్కరు కూడా నష్ట పోకూడదని  మేము ఈ సినిమాను చూపించడం జరిగింది. వారు ఈ సినిమాను చూసి అనుకున్న దానికంటే ఎక్కువ ప్రైజ్ ఇచ్చి మేము సినిమాను విడుదల చేస్తామని ముందుకు వచ్చారు వారికి మా ధన్యవాదాలు. 'రాజావారు రాణివారు'  సినిమా అయిపోగానే ప్రమోద్ రాజన్న లు నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. నీకు ఏది నచ్చితే అది చేయమని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. వీరిద్దరి సపోర్టు మర్చిపోలేను. సాయి కుమార్ గారు సపోర్టు కూడా నేను మరువలేను మాకు డైలీ  ఎనర్జీ ఇచ్చి మంచి సపోర్ట్ గా నిలిచి చిన్న వారిమైనా మాకు ఫుల్ సపోర్ట్  ఇచ్చారు . ఒక మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. "SR కళ్యాణమండపం – Est. 1975"  ద్వారా మేము తీసిన  మంచి సినిమాను  మీరందరూ కూడా ఆదరించి మాకు  సపోర్ట్ నిలుస్తారని అనుకుంటున్నాం. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు చూసిన వారందరూ కూడా మా ఇంట్లో మాటల్లా ఉన్నాయని అన్నారు. ఇది మన మధ్య తరగతి కథ మధ్యతరగతి వారు అన్ని సాధించాలి దేనికీ భయపడ కూడదు అనే కాన్సెప్టుతో ఈ సినిమా తీశాము.ఈ  సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలోని ఎమోషన్స్ మీరు ఎప్పటికీ గుర్తు ఉంటాయి ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది  అందరూ ఫ్యామిలీతో ఈ సినిమాకు వెళ్ళండి.అందరికీ ఈ సినిమా  తప్పకుండా  నచ్చుతుందని అన్నారు ..
సంగీత దర్శకుడు భరద్వాజ్ మాట్లాడుతూ ...మేము చేసిన ఈ ప్రయత్నానికి ఇంత వస్తుందను కోలేదు మైలేజ్ డెడికేటెడ్ గా పనిచేసే ఈ టీమ్తో వర్క్ చేయడం నాకెంతో ఆనందంగా ఉంది కిరణ్ గారు నాకు కథ చెప్పినప్పుడు ఆయన వర్క్ డెడికేషన్ నాకు నచ్చింది ఇలాంటి ఫ్యాషన్ వర్క్ తో ఫ్యాషన్ గల టీంతోపనిచేసేందుకు చాలా సంతోషంగా ఉంది ఈ మూవీని చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని డీటెయిల్ గా ఉంటుంది ఇలాంటి మంచి టీమ్ తో చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సినిమాలో సాయి కుమార్ గారు ఎక్స్టెండెడ్ గా వర్క్ చేశారు .కొత్త కథనం కొత్త క్యారెక్టరైజేషన్ తో పిలిచారు పాటలు చాలా బాగా వచ్చాయి రీసన్స్ వాచెస్ తండ్రి లైఫ్ ఎట్ వర్క్ చేశారు ఎంత పిక్చర్స్ వారు ఈ మూవీ తీసుకొని థియేటర్లో విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది థియేటర్స్ లోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది .
 నిర్మాతలు ప్రమోద్, రాజు లు మాట్లాడుతూ. .మమ్మల్ని ఆశీర్వదించదానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు .మా నాన్నగారు అనివార్య కారణాల వలన రాలేకపోయారు కాబాటు మా ఈ "SR కళ్యాణమండపానికి" పెద్ద అయిన పెద్ద ఆయన సాయి కుమార్ గారి ఆశీస్సులతో స్టార్ట్ చేస్తాను. సాధారణంగా
కళ్యాణ మండపం అనేది ఒక కొత్త జంటను కలిపి ఆనందంగా జీవితాన్ని పంచుకోమని చేసేది.అలా ఈ "SR ఆర్ కళ్యాణమండపం" కూడా థియేటర్స్ ని ఆడియన్స్ ని కలిపి ఆనందం ఆహ్లాదం పంచి ఇస్తుంది. ఈ  పాండమిక్ సిచువేషన్ లో  ప్రేక్షకులు కొంత హాయిగా నవ్వుకుని హ్యాపీ గా సినిమా చూశామని ఫీల్ తో  బయటకు రావాలని ఆగస్టు 6న మా "SR కళ్యాణమండపం – Est. 1975 " మీ ముందుకు తెస్తున్నాం అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.ఈ సినిమా చూసిన వారందరికీ మొదటగా సాయికుమార్ గారే గుర్తుకొస్తారు. చదువుకొనే వయసులో చదువుకోక పోతే ఎం జరుగుతుందనేది ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాము. దర్శకుడు చాలా చక్కటి కథను మా కందించాడు.సాయి కుమార్ గారి నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ప్రతి కొడుకు తన తండ్రిని, ప్రతి తండ్రి తన కొడుకును గుర్తు చేసుకుంటాడు. ఇది ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం. ప్రతి తండ్రి కొడుకు కలిసి చూడాల్సిన సినిమా ఇది . ఎక్కడైనా విదేశాలలో ఉన్న కొడుకులు  మా సినిమాను చూస్తే తండ్రి దగ్గరకు వచ్చి ఒకరోజు గడిపి వెళతారు అంత మంచి కుటుంబ కథా చిత్రం మా "SR కళ్యాణమండపం"  సాయి కుమార్ గారు ఇందులో నటించాడు అనే దానికంటే జీవించాడు అనాలి. ఎప్పుడు యాంగ్రీ మ్యాన్ క్యారెక్టర్స్ చేసే సాయి గారు  మాలాంటి ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ల ను సపోర్ట్ చేస్తూ ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇందులో ఉన్న డైలాగ్  "ఎండా లేదు వాన లేదు ఎప్పుడు చూడు నా.. పంచలో రామాయణమే నా.." అనే డైలాగ్ ప్రతి ఒక్కరికీ ఆకట్టుకుంటోంది. ఇలాంటి క్యారెక్టర్ , ప్రతి  కొడుక్కి తండ్రి వ్యాల్యూ ఏందో మా "SR కళ్యాణమండపం" చూపిస్తుంది. మా హీరో కిరణ్ గారే ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవ్వడం జరిగింది. కిరణ్ నాకు 7 సంవత్సరాల క్రితం  "శ్రీకారం" షాట్ ఫిలిం దగ్గర నా క్లోజ్ ఫ్రెండ్స్  సిద్ధారెడ్డి  పరిచయం చేశాడు. అప్పుడే నేను మంచి స్టార్ అవుతాడు అనుకున్నాను.ఇప్పుడు సిద్ధారెడ్డి సహా నిర్మాత. చైతన్య భరద్వాజ్ గారు ఇచ్చిన ఆరు అద్భుతమైన పాటలు మాకు అందించాడు  భాస్కర్ భాస్కర్ పట్ల అద్భుతమైన లిరిక్స్ ఇచ్చాడు. మేము విడుద‌ల చేసిన పాట‌లు, టీజ‌ర్ కి యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తో మేము ఊహించని విధంగా రెస్పాన్స్ ఇచ్చారు ప్రేక్షకులు వారికి మా ధన్యవాదాలు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా అద్భుతంగా పని చేశారు  శ్రీధర్ సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. కొత్తగా వస్తున్న ప్రతి దర్శకుడు కూడా ఇండస్ట్రీ లో ఒక చోటు సంపాదించాలని కొన్ని ప్రయత్నం చేస్తాడు. అయితే  మా మా ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా పరిచయం అవుతున్న శ్రీధర్ మాత్రం ఈ సినిమాతో తన చోటును ప్రతి కుర్రకారు గుండెల్లో ప్రేమగా గునపం దింపి మరి తన చోటును కన్ఫామ్ చేసుకున్నాడు. మా ఎలైట్ ఎంటర్టైన్మెంట్ లో మీ శ్రీధర్ శ్రీధర్ గారిని పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్లీ మళ్లీ మీతో ఇలాంటి మంచి సినిమాలు తీస్తామని అనుకుంటున్నాం. మొదటి సినిమాకే ఇంత కమర్షియల్ హిట్ పక్క అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అందించాడు.. మీరు ఊహించని విధంగా ఈ సినిమా ఉంటుంది... ఈ సినిమాలో నటీనటు లందరూ కూడా చాలా చక్కగా నటించారు. ఈ సినిమాను ఓవర్సీస్ లో ఓరుగల్లు టాకీస్ పేరుతొసుదీప్ గారు ఆగస్ట్ 6న U.S లో కూడా 78 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇండియా వైడ్ శంకర్ గారు సుమారు 300 థియేటర్లలో విడుదల చేస్తాడను కున్నాము కానీ 600 థియేటర్లలో విడుదల చేస్తున్నాడు అలాగే కెనడా ఆస్ట్రేలియా లో కూడా సినిమాని విడుదల చేస్తున్నాము. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఆగస్ట్ 6 న వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలని అన్నారు.
తారాగ‌ణం -  కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్, సాయికుమార్ తులసి శివమణి, అరుణ్ కుమార్, అనిల్  జీలా, కష్యప్ శ్రీనివాస్. త‌దిత‌రులు

Related Posts